దేవరకద్ర మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలము. ఇది దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. హైదరాబాదు నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలం గుండా సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా వెళ్ళుచున్నది. మండల కేంద్రం దేవరకద్ర, కౌకుంట్ల మరియు డోకూర్ లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కోయిల్ సాగర్ ప్రాజెక్టు మండల పరిధిలో ఉంది. జిల్లాలో ప్రముఖమైన మన్యంకొండ శ్రీవేంకటేశ్వరాలయం ఈ మండలంలోనేఉంది. జిల్లా పరిషత్తు చైర్మెన్ గా పనిచేసిన కె.కె.రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి, మంత్రిగా పనిచేసిన పులివీరన్న, కవి డోకూరు బాలబ్రహ్మాచారి, పారిశ్రామికవేత్త బాదం రామస్వామి ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 57188. మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు, 23 గ్రామపంచాయతీలు కలవు.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున కోయిలకొండ మండలము, ఈశాన్యమున మహబూబ్‌నగర్ మండలము, తూర్పున అడ్డాకుల మండలము, ఆగ్నేయాన పెద్దమందడి మండలము, దక్షిణమున కొత్తకోట మండలము, పశ్చిమాన చిన్నచింతకుంట, ధన్వాడ మండలములు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52041. ఇందులో పురుషులు 26212, మహిళలు 25829. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 57188. ఇందులో పురుషులు 28877, మహిళలు 28311. జనాభాలో ఇది జిల్లాలో 31వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: మండలం గుండా సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా వెళ్ళుచున్నది. మండల కేంద్రం దేవరకద్రలో రైల్వేస్టేషన్ ఉంది. దేవరకద్ర నుంచి రాయచూర్‌కు నూతన రైలుమార్గం నిర్మాణదశలో ఉంది. ఇది పూర్తయితే దేవరకద్ర రైల్వేజంక్షన్ గా మారుతుంది. హైదరాబాదు నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మరికల్ ఈ మండలంలోని ప్రధాన రోడ్డు కూడలి. నారాయణపేట వెళ్ళు మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంది.
ఈ మండలం దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2004లో దేవరకద్ర జడ్పీటీసి నుంచి విజయం సాధించిన సితదయాకర్ రెడ్డి జడ్పీచైర్మెన్ అయ్యారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ప్రదీప్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 36 ప్రాథమిక పాఠశాలలు (29 మండల పరిషత్తు, 7 ప్రైవేట్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (13 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 6 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 12 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ, 4 ప్రైవేట్), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. చరిత్ర: ఈ మండలానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. క్రీ.పూ.5వ శతాబ్దంలో ఇక్కడ ఆదిమానవులు నివశించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. చౌదర్‌పల్లి సమీపంలోని గుట్టలలో ఆదిమానవుల రాతిపనిముట్లను పురావస్తు శాఖ అధికారులు సేకరించారు. మన్యంకొండ ప్రాంతంలో కూడా పూర్వం మునులు చేసేవారని, ఇక్కడ కూడా పురాతనమైన మానవులు ఉపయోగించిన రాతి ఆనవాళ్ళు బయటపడ్డాయి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 23767 హెక్టార్లలో 43% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 10% అటవీ భూమి ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి, వరి. కందులు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 635 మిమీ. మండలంలో సుమారు 3400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. అధ్యాత్మికం: జిల్లాలోనే ప్రముఖమైన శ్రీవేంకటేశ్వరాలయం మన్యంకొండలో ఉంది. ఇది 6(ఏ) విభాగంలో దేవాదాయశాఖ పరిధిలో కొనసాగుతున్నది. చిన్నరాజమూరులో ప్రముఖమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. వెంకటగిరిలో పురాతనమైన శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం ఉంది.మన్యంకొండ దిగువన శ్రీ అలివేలుమంగ దేవస్థానం ఉంది. మండల ప్రత్యేకతలు:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
దేవరకద్ర మండలం (Devarkadra Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి