సరళాసాగర్ ప్రాజెక్టు వనపర్తి జిల్లాలో కొత్తకోట మండలంలోని శంకరయ్యపేట గ్రామ సమీపంలో కృష్ణానదికి ఉపనది అయిన చిన్నవాగుపై నిర్మించారు. ఇది మదనాంతపురం (వనపర్తి రైల్వేస్టేషన్) నుంచి 2 కిమీ, కొత్తకోట నుంచి 5 కిమీ దూరంలో ఉన్నది. 1947లో నిర్మాణం ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు 1959లో పూర్తయింది. ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీ ఉపయోగించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆసియాఖండంలో ఈ తరహా టెక్నాలజీ ఉపయోగించిన తొలి నీటిపారుదలప్రాజెక్టు ఇదే. వనపర్తి సంస్థానాధీశుడు తన తల్లి సరళాదేవి పేరిట ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రెండు కాలువలు కల ఈ ప్రాజెక్టు వల్ల కొత్తకోట మండలానికి ప్రయోజనం కలుగుతుంది.
చరిత్ర: 1947లో అప్పటి వనపర్తి సంస్థానాధీశుడు రాజారామేశ్వరరావు తన సరళాదేవి పేరిట ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. 1948లో విమోచనాంతరం మరోసారి శంకుస్థాపన చేయబడింది. దాదాపు దశాబ్దకాలం నిర్మాణం అనంతరం 1959 జూలై 26న అప్పటి రాష్ట్ర మంత్రి జె.నర్సింగరావుచే ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఆటోమేటిక్ సైఫన్లు: ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీని ఉపయోగించిన ప్రాజెక్టులలో ఇది ఆసియాలోనే మొదటిది. నీటిసామర్థ్యం గరిష్టస్థాయికి చేరినప్పుడు వాటంతట అవే సైఫన్లు తెరుచుకోవడం దీని ప్రత్యేకత. సైఫన్లు తెరవడానికి, మూయడానికి ఆపరేతర్లు అవసరం లేదు. ఈ ప్రాజెక్టు సుమారు 4500 అడుగుల పొడవు ఉంది. కుడి, ఎడమ అనే రెండు కాలువలున్నాయి. కుడికాలువ పొడవు 8 కిమీ, ఎడమ కాలువ పొడవు 17 కిమీ. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
|
27, జూన్ 2019, గురువారం
సరళాసాగర్ ప్రాజెక్టు (Sarala Sagar Project)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి