తెలంగాణలోని 33 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది. ఈ జిల్లాలో 1 డివిజన్, 14 రెవెన్యూ మండలాలు, 5 పురపాలక సంఘాలు, 223 రెవెన్యూ గ్రామాలు, 128 ఎంపీటీసి స్థానాలు, 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే. తెలంగాణలో తొలి పాలిటెక్నిక్ కళాశాల ఈ జిల్లాలోనే నెలకొల్పబడింది. ఆంధ్రబిల్హణ బిరుదాంకితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్తి వనపర్తి జిల్లాకు చెందినవారు. 1948వరకు వనపర్తి సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. వనపర్తి పట్టణానికి రైలు సదుపాయం కాని, జాతీయ రహదారి సదుపాయం కాని లేదు. కాని జిల్లా మీదుగా (కొత్తకోట, పెబ్బేరు పట్టణాల మీదుగా) 44వ నెంబర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. అలాగే జిల్లా పశ్చిమ భాగం నుంచి సికింద్రాబాదు-గద్వాల రైలుమార్గం ఉన్నది. వనపర్తి రోడ్ పేరిట మదనాపూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున నాగర్‌కర్నూల్ జిల్లా, ఉత్తరాన మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన జోగులాంబ గద్వాల జిల్లా, దక్షిణాన కర్నూలు జిల్లా (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) సరిహద్దులుగా ఉన్నాయి. కృష్ణానది జిల్లా గుండా ప్రవహిస్తుంది. రవాణా సౌకర్యాలు: జిల్లా మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. కొత్తకోట మరియు పెబ్బేరులు జాతీయ రహదారిపై ఉన్న ప్రధాన పట్టణాలు. జిల్లా కేంద్రమైన వనపర్తి నుంచి బిజినేపల్లి మీదుగా హైదరాబాదుకు, పెబ్బేరు మీదుగా కర్నూలుకు, కొత్తకోట మీదుగా మహబూబ్‌నగర్‌కు బస్సు సౌకర్యం ఉంది. జిల్లా పశ్చిమ భాగం నుంచి సికింద్రాబాదు - గద్వాల సెక్షన్ రైలుమార్గం ఉంది. వనపర్తి రోడ్ పేరిట మదనాపురంలో రైల్వేస్టేషన్ ఉంది. మండలాలు: వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: News Districts in telangana, Wanaparthy Dist in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి