విజయనగరం జిల్లా జూన్ 1, 1979న అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 23వ జిల్లాగా ఏర్పడింది. విశాఖపట్టణం మరియు శ్రీకాకుళం జిల్లాలలోని కొన్ని తాలుకాలను విడదీసి ఈ రెండు జిల్లాల మధ్యన నూతనంగా విజయనగరం జిల్లాను ఏర్పాటుచేశారు. ఉత్తర, దక్షిణ దిశలలో ఒరిస్సా రాష్ట్రం, బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 6,539 చకిమీ. 12 తాలుకాలు ఉన్న ఈ జిల్లాలో మండలాల వ్యవస్థ అనంతరం 34 మండలాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం జిల్లాలో 4 పురపాలక సంఘాలు, ఒక నగరపంచాయతి ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 23.42 లక్షలు. జంఝావతి, వెంకళరాయసాగర్, తోటపల్లి, ఆండ్ర, తాడిపూడి, పెద్దగెడ్డ జలాశయాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం ఈ జిల్లాలోని ప్రముఖ పట్టణాలు. ఈ జిల్లా గుండా సువర్ణముఖి, నాగావళి, చంపావతి, గోస్తనీ, వేగావతి, శారద, జంఝావతి నదులు ప్రవహిస్తున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రంలో ఈశాన్యం వైపున ఉన్నది. ఈ జిల్లాకు తూర్పున శ్రీకాకుళం జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన విశాఖపట్టణం జిల్లా, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. విజయనగరం జిల్లా 17డి15'-19డి15' ఉత్తర అక్షాంశం మరియు 83డి00'-83డి45' తూర్పు రేఖాంశాల మధ్యన ఉన్నది.
ఈ జిల్లా ప్రాంతం పూర్వం కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత శాతవాహనులు, విష్ణుకుండినులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు పాలించారు. 1734లో చేబ్రోలు యుద్ధం, 1753లో తుమ్మపాల యుద్ధం, 1757లో విజయనగరం రాజులకు, బొబ్బిలి రాజులకు మధ్యన బొబ్బిలియుద్ధం జరిగింది. 1758లో ఫ్రెంచి వారికి, బ్రిటీష్ వారికి మధ్యన చందుర్తి యుద్ధం, 1794లో పద్మనాభ యుద్ధం జరిగింది. పూసపాటి రాజవంశీయులు విజయనగరం సంస్థానం అధిపతులుగా పాలించారు. బ్రిటీష్ కాలంలో ఇక్కడ జాతీయోద్యమం చురుకుగా సాగింది. బ్రిటీష్ కాలంలో ఈ ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రంలోనూ, భాషాప్రయుక్త రాష్ట్రాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చేరింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1979, జూన్ 1న ఇదివరకటి శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలోని తాలుకాలతో ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. రవాణా వ్యవస్థ: రోడ్డురవాణా:కోల్కత-చెన్నై జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. భోగపురం, పూసపాటిరేగ, ఛత్రం ఈ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు. భీమునిపట్నం నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి విజయనగరం, గజపతినగరం, సాలురు మీదుగా వెళ్ళుచున్నది. ఇవి కాకుండా విజయనగరం నుంచి చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెళ్ళు రహదారి, శ్రీకాకుళం నుంచి పార్వతీపురం రహదారి, రామభద్రాపురం నుంచి బొబ్బిలి, పార్వతీపురం, కొమరాడల మీదుగా ఒరిస్సా వెళ్ళు రహదారులు జిల్లాలో ఉన్నాయి. రైలురవాణా: కోల్కత-చెన్నై రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళును. ఈ మార్గంలో విజయనగరం, చీపురుపల్లి పట్టణాలు ప్రధానమైనవి. అలాగే విజయనగరం నుంచి గజపతినగరం, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం, కొమరాడల మీదుగా ఒరిస్సాలోని రాయగఢ్ వెళ్ళు రైలుమార్గం కూడా ఉంది.
జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోకసభ నియోజకవర్గం ఉంది. 2019 ఎన్నికలలో మొత్తం 9 శాసనసభ స్థానాలలో వైకాపా విజయం సాధించింది.. పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఈ జిల్లాకు చెందినవారు. ఆర్.ఎన్.ఆర్.కె.రంగారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అశోక గజపతిరాజు, ఆనంద గజపతిరాజు, పెన్మత్స సాంబశివరావు, జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనాయకులు. అధ్యాత్మికం: విజయనగరంలో ఉత్తరాంద్రుల ఇలవేల్పు పైడితల్లి దేవాలయం, రామాయణ కాలం నాటి ప్రశక్తిఉన్న రామతీర్థం, తోటపల్లి శ్రీవేంకటేశ్వర దేవస్థానం, శృంగవరపుకోట సమీపంలోని పుణ్యగిరి క్షేత్రం, శంబరలోని పోలమాంబ ఆలయం, బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయం, భీమునిపట్నంలోని పద్మనాభస్వామి ఆలయం జిల్లాలోని ప్రముఖ ఆలయాలు.
|
1, జూన్ 2013, శనివారం
విజయనగరం జిల్లా (Vizianagaram DIst)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి