22, మార్చి 2014, శనివారం

నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Narsapur Assembly Constituency)

నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 6 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2014 & 2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థి సీహెచ్ మదన్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు కలవు.
  • కొల్చారం, 
  • వెల్దుర్తి, 
  • కౌడిపల్లి, 
  • శివ్వంపేట, 
  • నర్సాపూర్, 
  • హత్నూరు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ

1957 గుండం వీరయ్య కాంగ్రెస్ పార్టీ

1962 విఠల్ రెడ్డి సీపీఐ జి.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
1967 సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ విఠల్ రెడ్డి సీపీఐ
1972 సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ విఠల్ రెడ్డి సీపీఐ
1978 విఠల్ రెడ్డి సీపీఐ సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ
1983 సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ విఠల్ రెడ్డి సీపీఐ
1985 విఠల్ రెడ్డి సీపీఐ సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ
1989 విఠల్ రెడ్డి సీపీఐ సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ
1994 విఠల్ రెడ్డి సీపీఐ సి.జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ
1999 సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ విఠల్ రెడ్డి సీపీఐ
2004 సునీతా లక్ష్మారెడ్డికాంగ్రెస్ పార్టీ

2009 సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి సీపీఐ
2014 చిలుముల మదన్ రెడ్డి తెరాస సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 చిలుముల మదన్ రెడ్డి తెరాస సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన సునీతా లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి, సీపీఐకు చెందిన కిషన్ రెడ్డిపై 13274 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి వరసగా 3వ సారి శాసనసభలో ప్రవేశించారు. పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున ఈ స్థానం సీపీఐకు వెళ్ళడంతో టికెట్ ఆశించిన మిగితా పార్టీల వారు ఏకమై మాజీ ఎమ్మెల్యే వాసుదేవరావును ఇండిపెండెంటుగా బరిలోకి దింపారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన సి.హెచ్.మదన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీత లక్ష్మారెడ్డిపై 14217 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున చిలుముల మదన్ రెడ్డి, భాజపా తరఫున ఎస్.గోపి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీతా లక్ష్మారెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన చిలుముల మదన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాకటి సునీత పై 38320 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.




హోం,
విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోకసభ నియోజకవర్గం, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక