13, ఆగస్టు 2014, బుధవారం

దాశరథి రంగాచార్య (Dasarathi Rangacharya)

దాశరథి రంగాచార్య
జననంఆగస్టు 24, 1928
స్వస్థలంచిన్నగూడూరు (మహబూబాబాదు జిల్లా)
రంగంతెలంగాణ విమోచనోద్యమం, సాహితీవేత్త,
అవార్డులుసాహిత్య అకాడమీ అవార్డు,
మరణంజూన్ 8, 2015
ప్రముఖ సాహితీవేత్త మరియు తెలంగాణ విమోచనోద్యమ సమరయోధుడైన దాశరథి రంగాచార్య మహబూబాబాదు జిల్లా చిన్నగూడూరు గ్రామంలో ఆగస్టు 24, 1928న జన్మించారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనం తర్వాత ఉపాధ్యాయుడిగా, అనువాదకుడిగా పనిచేసి, సికింద్రాబాదు కార్పోరేషన్ డిప్యూటి కమీషనరు హోదాలో 1988లో పదవీవిరమణ పొందారు. పలు గ్రంథాలు రచించి సాహితీవేత్తగా పేరుపొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు పలు పురస్కారాలు పొందిన రంగాచార్య "చిల్లర దేవుళ్ళు" నవల ద్వారా ప్రసిద్ధి చెందారు. తన ఆత్మకథను "జీవనయానం" పేరుతో రచించారు. 2015, జూన్ 8న రంగాచార్య మరణించారు. ప్రముఖ సాహితీవేత్త, సినీపాటల రచయిత దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు.

సాహితీ ప్రస్థానం:
తెలంగాణ విమోచనోద్యమానికి ముందు నిజాం ఆగడాలను స్వయంగా చూసిన రంగాచార్య వీటిని గ్రంథస్తం చేయడానికి పూనుకున్న రచనే "చిల్లర దేవుళ్ళు". నిజాం కాలంలో అప్పటి ప్రజల దుర్భర స్థితిగతులను, దారుణమైన నానిస బతుకులను రంగాచార్య ఇందులో అక్షీకరించారు. సంస్థానం విలీనం తర్వాత ప్రజలు నిజాం దురాగతాలను మరిచిపోయి నిజాంను కీర్తిస్తారనే అనుమానంతో గ్రంథరచన చేసినట్లుగా రంగాచార్య చెప్పుకున్నారు. 1970లో ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. హిందీ, ఆంగ్ల మరియు పలు ప్రాంతీయ భాషలలో ఈ గ్రంథం అనువదించబడింది. ఇదే పేరుతో తెలంగాణ యాసలో సినిమా కూడా విడుదలైంది. మోదుగుపూలు, జనపథం, రానున్నది ఏది నిజం, మానవత్వం, పావని తదితర గ్రంథాలే కాకుండా "జీవనయానం" పేరుతో తన ఆత్మకథను కూడా రచించారు. 2000లో వేదం ఆవిష్కరణ జరిగింది. 

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
తెలంగాణ రచయితలు, మహబూబాబాదు జిల్లా ప్రముఖులు, 2015లో మరణించినవారు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, తెలంగాణ విమోచనోద్యమం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక