చినగూడూరు మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 5 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ రచయితలు దాశరథి కృష్ణమాచార్య మరియు దాశరథి రంగాచార్య ఈ మండలమునకు చెందినవారు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్తుంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదే సమయంలో ఈ మండలంలోని గ్రామాలు వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మహబూబాబాదు మండలం, తూర్పున కురవి మండలం, దక్షిణాన మరిపెడ మండలం, పశ్చిమాన నర్సింహులుపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 83814. ఇందులో పురుషులు 43625, మహిళలు 40189. స్త్రీపురుష నిష్పత్తి 921/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన వల్లూరి పద్మ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మూల సునీత ఎన్నికయ్యారు.
చినగూడూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Chinnagudur, Gundamrajupalli, Jayyaram, Uggampalli, Veesampalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చినగూడూరు (Chinagudur): చినగూడూరు మహబూబాబాదు జిల్లా మరిపెడ మండలమునకు చెందిన గ్రామము. రచయిత దాశరథి కృష్ణమాచార్య మరియు దాశరథి రంగాచార్య ఈ గ్రామమునకు చెందినవారు. జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
China Gudur Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి