మహబూబాబాదు జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న నూతనంతా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని 16 మండలాలలో 14 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాలోనివి కాగా రెండు మండలాలు ఖమ్మం జిల్లాలోనివి.
జిల్లాలో మహబూబాబాదు మరియు తొర్రూరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. డోర్నకల్ నుంచి సింగరేణికి మరోమార్గం ఉంది. జిల్లాలో 461 గ్రామపంచాయతీలు, 198 ఎంపీటీసి స్థానాలు ఉన్నాయి. జిల్లా సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దక్షిణాన ఖమ్మం జిల్లా, నైరుతిన సూర్యాపేట జిల్లా, పశ్చిమాన జనగామ జిల్లా, వాయువ్యాన వరంగల్ గ్రామీణ జిల్లా, ఉత్తరాన ములుగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా ప్రముఖులు: సాహితీవేత్తలు దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, సంగీత దర్శకుడు చక్రి, విద్యావేత్త చుక్కారామయ్య, పత్రిక సంపాదకులు ఒద్దిరాజు సోదరులు, చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు, పోరాటయోధురాలు చెన్నబోయిన కమలమ్మ ఈ జిల్లాకు చెందినవారు మండలాలు: మహబూబాబాదు, కురవి, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, దంతలపల్లి, తొర్రూరు, నెల్లికుదూర్, మరిపెడ, నర్సింహులుపేట, పెద్దవంగర ఇవి కూడా చూడండి:
= = = = =
మూలాలు:
|
Tags: News Districts in telangana, Mahabubabad Dist in Telugu
Tags: Mahabubabad DIst in Telugu. telugulo mahabubabad jilla, mahabubabad zilla in telugulo, 27 dists of telangana in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి