15, ఆగస్టు 2014, శుక్రవారం

పసుపులేటి సుధాకర్ (Pasupuleti Sudhakar)

పసుపులేటి సుధాకర్
జననంమార్చి 14, 1975
స్వస్థలంపూనూరు (ప్రకాశం జిల్లా)
ప్రస్తుత హోదాఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్‌
నిజామాబాదు నగరపాలక సంస్థలో ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్‌గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి సుధాకర్ మార్చి 14, 1975న ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం పూనూరు గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు స్థానికంగానే పూనూరులో విద్యాభ్యాసం చేసి ఇంటర్మీడీయట్, డిగ్రీ చీరాలలో పూర్తిచేశారు.1997లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.(తెలుగు), 2000లో అదే విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్ పట్టాలు అందుకున్నారు. 2007లో గ్రూప్-1కు ఎంపికై ఏటూరు నాగారం, వరంగల్‌లలో పనిచేసి ఫిబ్రవరి 2014లో పదోన్నతిపై మహబూబ్‌నగర్‌లో జిల్లా ఆడిటు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. జూలై 2019లో ఉప సంచాలకులుగా పదోన్నతిపొంది ప్రస్తుతం నిజామాబాదు నగరపాలక సంస్థలో ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్‌గా పనిచేస్తున్నారు.

ఉద్యోగ ప్రస్థానం:
2007లో గ్రూప్-1కు ఎంపికై రాష్ట్ర ఆడిటు శాఖలో సహాయ ఆడిటు అధికారిగా ఫిబ్రవరి 20న ఏటూరునాగారంలో ITDAలో ఉద్యోగంలో చేరారు. 2008 అక్టోబరులో ఆడిటు అధికారి, స్టేట్ ఆడిట్, వరంగల్ కార్యాలయానికి బదిలీ అయి ఆరేళ్ళ పాటు విధులు నిర్వర్తించారు. 2011 ఆగస్టు నుంచి 2013 ఫిబ్రవరిలో పదోన్నతి వచ్చేవరకు జిల్లా ఆడిటు అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2013 ఫిబ్రవరిలో జిల్లా ఆడిటు అధికారిగా పదోన్నతిపై మహబూబ్‌నగర్‌కు బదిలీ అయి ప్రస్తుతం ఇక్కడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 2, 2018 నుంచి పంచాయతి ఎన్నికల వరకు ఉట్కూరు గ్రామపంచాయతి ప్రత్యేక అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. జూలై 2019లో ఉప సంచాలకులుగా పదోన్నతిపొంది ప్రస్తుతం నిజామాబాదు నగరపాలక సంస్థలో ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్‌గా పనిచేస్తున్నారు


విభాగాలు: యద్ధనపూడి మండలం, 1975లో జన్మించినవారు,


 = = = = =


Tags: State Audit Department Officers, about Pasupuleti Sudhakar

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక