జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 12 రెవెన్యూ మండలాలు కలవు. ఈ మండలాలన్నీ పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.
శివకవి పాల్కురికి సోమనాథుడు, సహజకవిగా పేరుపొందిన బమ్మెర పోతన, సమరయోధులు సర్వాయిపాపన్న, దొడ్డి కొమురయ్య, గంగుల శాయిరెడ్డి, చౌడవరపు విశ్వనాథం, విద్యావేత్త చుక్కారామయ్య, రాజకీయ నాయకులు తాటికొండ రాజయ్య, నిమ్మ రాజిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు. చారిత్రక సిద్ధులగుట్ట, సర్వాయికోట, ఇత్తడి కళారూపాలకు పేరుగాంచిన పెంబర్తి, జఫర్‌గఢ్ కోట ఈ జిల్లాలో కలవు. భౌగోళికం, సరిహద్దులు భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలు, తూర్పున వరంగల్ పట్టణ మరియు వరంగల్ గ్రామీణ జిల్లాలు, దక్షిణాన సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు సికింద్రాబాదు నుంచి కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు ప్రధానరహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. జిల్లా ప్రత్యేకతలు తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు దొడ్డి కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
3, ఫిబ్రవరి 2017, శుక్రవారం
జనగామ జిల్లా (Janagoan District)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి