6, నవంబర్ 2014, గురువారం

విశాఖపట్నం (Visakhapatnam)

విశాఖపట్నం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యము544 చకిమీ
జనాభా20,91,811
ప్రముఖులురేణుకా చౌదరి,
దేవికా రాణి,
జి.రోహిణి,
కందాళ సుబ్రహ్మణ్యం
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రముఖ నగరం మరియు అతిపెద్ద నగరం. బ్రిటిష్ కాలంలో వాల్తేరుగా పిలువబడిన ఈ నగరం బంగాళాఖాతం తీరాన ఉన్నది. ఇక్కడి సహజ సిద్ధంగా ఏర్పడీన ఓడరేవు దేశంలోని ప్రముఖ రేవులలో ఒకటి మరియు నౌకా నిర్మాణ కేంద్రం, ఉక్కు కర్మాగారం ఉన్నాయి. కూడా కలిగియుంది. విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, డాల్ఫిన్స్‌నోస్‌, ప్రాచీన బౌద్ధస్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ పరిసరాలలో చూడవచ్చు. నగర పాలన విశాఖ నగర పాలకసంస్థచే నిర్వహించబడుతుంది. నగర వైశాల్యము 544 చదరపు కిలోమీటర్లు మరియు 2011 ప్రకారం నగర జనాభా 20,91,811. కేంద్రమంతిగా పనిచేసిన రేణుకా చౌదరి, ప్రముఖ నటి దేవికా రాణి, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడు కందాళ సుబ్రహ్మణ్యం ఈ నగరంలోనే జన్మించారు.

చరిత్ర:
గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను కలదు. ఈ ప్రాంతాన్ని కళింగ, చాళుక్య, చోళ, గోల్కొండ, కుతుబ్ షాహీల వంటి ఎన్నో ప్రముఖ రాజ వంశాల వారు పరిపాలించారు. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్రలోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 15 ఆగష్టు 1950న ఈ జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటుచేశారు. 1953 వరకు ఈ నగరం మద్రాసు ప్రెసిడెన్సిలో ఉంటూ, 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుతో ఈ నగరం ఆంధ్రరాష్ట్రంలో భాగంగా కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో అందులో భాగంగా మారింది.

బీచ్ రోడ్, విశాఖపట్నం
భౌగోళికం:
17.6883° ఉత్తర అక్షాంశం మరియు 83.2186° తూర్పు రేఖాశంపై ఉన్న విశాఖపట్టణం బంగాళాఖాతం తీరాన ఉంది. సమీపంలోనే తూర్పు కనుమలు విస్తరించియున్నాయి. సముద్ర తీరం పై నుంచి వీచే ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నగర వైశాల్యము 544 చదరపు కిలోమీటర్లు. 

జనాభా:
1901లో 40,892 ఉన్న ఈ నగర జనాభా 2011 లెక్కల ప్రకారం 20,91,811కు పెరిగింది. 2001 నాటి 13,45,938 జనాభాతో పోలిస్తే 55% వృద్ధిచెందింది. నగర అక్షరాస్యత శాతం 82.66%.

రాజకీయాలు:
ఈ నగరం విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 4 అసెంబ్లీ నియోజకవర్గాలు నగర పరిధిలో ఉన్నాయి. 2019 లోకసభ ఎన్నికలలో విశాఖపట్టణం నుంచి వైకాపాకు చెందిన వైవీవి సత్యనారాయణ సాధించారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా వైకాపా విజయం సాధించింది.

విశాఖ విమానాశ్రయం
రవాణా సౌకర్యాలు:
విశాఖపట్టణం విమానాశ్రయం రాష్ట్రంలోనే అతి రద్దీకల విమానాశ్రయం. దేశంలోని ప్రముఖ నగరాలకే కాకుండా దుబాయి, సింగపూర్ లకు కూడా విమానసర్వీసులు నడుస్తాయి. రైల్వేల పరంగా వాల్తేర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఒక డివిజన్ కేంద్రముగా ఉంది. విశాఖపట్టణం రైల్వేస్టేషన్ చెన్నై-కోల్‌కత మార్గంలో ఉంది. నగరంలో మెట్రో రైల్వే నిర్మాణానికి ప్రతిపాదన కూడా ఉంది. కోల్‌కత-చెన్నై 5వ నెంబరు జాతీయ రహదారి నగరం మీదుగా వెళ్ళుచున్నది. ఇక్కడి నుంచి ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది. 

విశాఖపట్టణం హార్బర్
ఆర్థికం:
ఓడరేవు, విమానాశ్రయం, రోడ్డు మరియు రైల్వేలపరంగా మంచి సదుపాయాలు ఉండటంతో ఆర్థికంగా ఈ నగరం బాగా అభివృద్ధి చెందింది. నౌకానిర్మాణ కేంద్రం, విశాఖ ఉక్కు కర్మాగారం, చేపల పరిశ్రమ, పలు సెజ్‌లు, పారిశ్రామిక పార్కులు, కోరమాండల్ ఎరువుల పరిశ్రమ, పెట్రో కర్మాగారాలు, విద్యుత్ కర్మాగారాలు తదితర భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ కూడా అభివృద్ధి సాధిస్తోంది.

క్రీడలు:
క్రికెట్ ఇక్కడి ప్రజాదరణ కలిగిన క్రీడ. టెన్నిస్ మరియు ఫుట్‌బాల్ కూడా నగర వాసులు ఆడుతారు. ఇక్కడి క్రికెట్ స్టేడీయంలో అంతర్జాతీయ వన్డే పోటీలు మరియు రంజీ ట్రోఫి పోటీలు నిర్వహించబడతాయి.


ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ నగరాలు, విశాఖపట్టణం, విశాఖపట్టణం జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక