13, మార్చి 2015, శుక్రవారం

ఎన్.డి.తివారి (N.D.Tiwari)

ఎన్.డి.తివారి
జననంఅక్టోబరు 18, 1925
రంగంరాజకీయాలు
నిర్వహించిన పదవులురెండు రాష్ట్రాలకు (4 సార్లు) ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, గవర్నరు,
ప్రముఖ రాజకీయ నాయకుడైన నారాయణ్ దత్ తివారి అక్టోబరు 18, 1925న ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాలుటి గ్రామంలో జన్మించారు. ప్రారంభంలో అటవీశాఖలో ఉద్యోగం చేసి జాతీయోద్యమంలో ప్రవేశించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ అయి 15 మాసాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యానంతరం 3 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నప్పుడు సెక్సు కుంభకోనం బయటపడి బలవంతంగా పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 2014లో దాదాపు 90 సంవత్సరాల వయస్సులో ఉజ్వలాశర్మను వివాహం చేసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం:
స్వాతంత్ర్యానంతరం జరిగిన ఉత్తరప్రదేశ్ తొలి శాసనసభ ఎన్నికలలో నైనిటాల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. 1963లో రాష్ట్రమంత్రి పదవి లభించింది. 1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొంది 1977 ఏప్రిల్ వరకు పదవిలో ఉన్నారు. 1980లో లోకసభకు ఎన్నికై కేంద్రమంత్రిపదవి పొందారు. ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1984లో రెండో పర్యాయం, 1988లో మూడో పర్యాయం  ముఖ్యమంత్రి పదవి పొంది ఏడాది చొప్పున పనిచేశారు. 1985-88 కాలంలో రాజ్యసభ సభ్యుడిగాఉంటూ కేంద్రమంత్రిపదవి నిర్వహించారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1995లో అర్జున్‌సింగ్‌తో కలిసి ఆలిండియా కాంగ్రెస్ (తివారి)ని స్థాపించారు. రెండేళ్ళకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి 1996, 1999లలో లోకసభకు ఎన్నికైనారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం అవతరణ తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2002 నుంచి ఐదేళ్ళు పాలించారు. 2007లో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియామకం పొంది 2009 డిసెంబరులో సెక్స్ కుంభకోణం బయటపడటంతో పదవి వదులుకోవాల్సి వచ్చింది.
 


విభాగాలు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, కేంద్ర ఆర్థికమంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక