28, ఆగస్టు 2020, శుక్రవారం

ఉత్తరాఖండ్ (Uttarakhand)

రాజధాని
డెహ్రాడూన్
వైశాల్యం
53,483 చకిమీ
జనాభా
1,00,86,292 (2011)
హైకోర్టు
నైనిటాల్
అధికార భాష
హిందీ
ఎత్తయిన శిఖరం
నందాదేవి
ముఖ్యమంత్రి
పుష్కర్‌సింగ్ ధామి
గవర్నరు
బేబి రాణిమౌర్య
ఉత్తరాఖండ్ ఉత్తరభారతదేశానికి చెందిన రాష్ట్రం. ఇది హిమాలయాలపై ఉంది. దేవభూమిగా పేరుపొందిన ఈ రాష్ట్రం పవిత్ర గంగానది జన్మస్థానాన్ని కల్గియుంది. ఉత్తరాఖండ్ రాజధాని నగరం డెహ్రాడూన్ (శీతాకాల), గౌర్‌సైన్ (వేసవి). ఉత్తరాఖండ్ అధికార భాషలు హిందీ, సంస్కృతం. రాష్ట్ర వైశాల్యం 53483 చకిమీ (దేశంలో 19వ స్థానం) మరియు 2011 ప్రకారం జనాభా సుమారు ఒకకోటి (దేశంలో 21వ స్థానంలో). ఉత్తరాఖండ్‌లో 70 శాసనసభ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు, జిల్లాలు 13 కలవు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదరినాథ్, గంగోత్రి, ప్రముఖ హిల్-స్టేషన్లు నైనిటాల్, ముస్సోరి, అల్మోరా  రాష్ట్రంంలో ఉన్నాయి. 2000లో అవతరణకు పూర్వం ఈ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో భాగంగా ఉండేది.

భౌగోళికం:
ఉత్తరాఖండ్ రాష్ట్ర వైశాల్యం 53,483 చకిమీ. రాష్ట్రలో 86% భూభాగం పర్వతాలతో, 65% భూభాగం అరణ్యాలతో వ్యాపించియుంది. రాష్ట్ర ఉత్తరభాగం పూర్తిగా హిమాలయ పర్వతాలలో శిఖరాలతో కూడి ఉంది. గంగానది జన్మించే గంగోత్రి, యమునానది జన్మించే యమునోత్రి ప్రాంతాలు ఈ రాష్ట్రంలోనివే. వీటితో పాటు బద్రీనాథ్, కేదర్‌నాథ్ కలిపి నాలుగు క్షేత్రాలను ఛోటా ఛార్‌ధామ్‌గా వ్యవహరిస్తారు. బెంగాల్ టైగర్లకు ప్రఖ్యాతిగాంచిన జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్ రాష్ట్ర పరిధిలో ఉంది. టిబెట్టు (చైనా), నేపాల్‌లతో పాటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను సరిహద్దులుగా కల్గియుంది.

చరిత్ర:
ఉత్తరాఖండ్ చాలా ప్రాచీన చరిత్రను కల్గియుంది. రాతియుగం నాటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభించాయి. అశోకుడు వేయించిన శాసనం గర్వాల్ ప్రాంతంలో లభ్యమైంది. ఆది శంకరాచార్యులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గర్వాల్ ప్రాంతం చాలా కాలంపాటు ప్రత్యేక రాజ్యంగా వర్థిల్లింది. ఆధునిక యుగంలో 1816లో సగౌలీ ఒప్పందం ప్రకారం అధికప్రాంతం బ్రిటీష్ ఇండియాలో చేరింది. 1970లలో ఈ ప్రాంతంలో చిప్కోఉద్యమం నడిచింది (అడవుల పరిరక్షణకై) 1990లలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిచింది. 2000లో ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రారంభంలో (2007 వరకు) ఈ రాష్ట్రం పేరు ఉత్తరాంచల్, తర్వాత ఉత్తరాఖండ్‌గా మార్చబడింది.

ప్రముఖులు:
గోవింద వల్లభ్ పంత్, సుందర్‌లాల్ బహుగుణ, వందనాశివ, ఎన్.డి.తివారీ, సుమిత్రానందన్ పంత్, అభివన్ బింద్రా, నిర్మల్ పాండే (బాలీవుడ్ నటుడు), బిపిన్ చంద్ర జోషి (ఆర్మీ చీఫ్), బచేంద్రీపాల్, జస్పాల్ రాణా (షూటర్) ఈ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు.
 
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు:  భారతదేశ రాష్ట్రాలు, ఉత్తరాఖండ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక