8, ఏప్రిల్ 2015, బుధవారం

వేయి స్తంభాల దేవాలయం (Thousanad Pillars Temple)

వేయి స్తంభాల దేవాలయం
నగరంహన్మకొండ
జిల్లావరంగల్ జిల్లా
నిర్మాణ కాలంక్రీ.శ. 1163
నిర్మించినదిరుద్రదేవుడు
తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటైన వేయిస్తంభాల ఆలయం వరంగల్ జిల్లా హన్మకొండలో ఉంది. ఈ ఆలయం అసలుపేరు రుద్రేశ్వరాలయం. క్రీ.శ.12వ శతాబ్దంలో కాకతీయ రుద్రదేవునిచే నిర్మించబడినట్లు చరిత్ర ప్రకారం తెలుస్తుంది. ఒక కూటంలో శివుడు, మరో విష్ణువు, మరొక కూటంలో సూర్యభగవానుడు ప్రతిష్టితులై ఆరాధనలందుకుంటున్న త్రికూటాలయం ఇది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ ఆలయంలొ రుద్రేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. కాకతీయుల కళావైభవానికి మచ్చుతునకైన ఈ ఆలయం మధ్యయుగంలో ముస్లిందాడులలో ధ్వంసమైంది.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు సందర్శకులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగా ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు వచ్చింది. ఆలయ వాయువ్య దిశలో అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైయున్నాయి. మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని భక్తుల నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషను నుంచి 5 కి.మీ. దూరంలో నున్న హన్మకొండకు చేరుకొని రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.

విభాగాలు: తెలంగాణ దేవాలయాలు, వరంగల్ జిల్లా దేవాలయాలు, వరంగల్ జిల్లా సందర్శనీయ ప్రదేశాలు, వరంగల్ నగరం, కాకతీయ సామ్రాజ్యము, క్రీ.శ.12వ శతాబ్దము,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక