ఏటూరు నాగారం ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 39 రెవెన్యూ గ్రామాలు కలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు ఈ మండలానికి చెందినవారు. దేవాదుల ప్రాజెక్టు మండలంలోని గంగారాం గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్నారు. మండల తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలంలో దట్టమైన అడవులున్నాయి. ఇది ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భాగము. మండలం మీదుగా జాతీయ రహదారి నెం. 202 వెళ్ళుచున్నది. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటుయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన కన్నాయిగూడెం మండలం, ఈశాన్యాన వాజేడు మండలం, తూర్పున వెంకటాపురం మండలం, ఆగ్నేయాన మంగపేట మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన తాడ్వాయి (సమ్మక్క సారక్క) మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 37153. ఇందులో పురుషులు 19015, మహిళలు 18138. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41046. ఇందులో పురుషులు 20264, మహిళలు 20782.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు ఈ మండలానికి చెందినవారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన అంతటి విజయ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన కుసుమ జగదీష్ ఎన్నికయ్యారు.
ఏటూరు నాగారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akulavari Ghanpur, Allamvari Ghanpur, Alugubelle (UI), Banajibandam, Butaram, Chalpaka, Chinna Venkatapur(UI), Chinnaboinapalle, Chinthagudem (UI), Chirragudem(UI), Dodla, Ekkela, Elishettipalle, Eturnagaram, Gogubelle, Gundenguvai (UI), Kondai, Kondred (UI), Koratpalle(UI), Kothagudem(UI), Lingapur, Malyala, Manasapally (UI), Maredupaka(UI), Medaram, (UI), Mullakatta, Oddugudem (UI), Papkapuram, Pedda Venkatapur, Raigudem (UI), Ramannagudem, Ramnager, (Koyagudem), Rampur Agrahar, Roheer, Shankarajpalle, Shapalle, Shivapuram, Teegalvai (UI), Yellapur (UI)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఏటూరు నాగారం (Etur Nagaram): ఏటూరు నాగారం ములుగు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఏటూరు నాగారంలో మార్కెట్ యార్డు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు ఏటూరు నాగారంలో జన్మించారు. ఏటూరునాగరంలో ఐటిడిఏ కార్యాలయం ఉంది. గంగారాం (Gangaram): గంగారాం ములుగు జిల్లా ఏటూరు నాగారాం మండలమునకు చెందిన గ్రామం. దేవాదుల ప్రాజెక్టు ఈ గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి మట్టం 71 మీటర్ల ఎత్తు నుంచి 581 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్ళి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలనేది లక్ష్యం. దీనివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,24,150 ఎకరాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14,100 ఎకరాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 82,500 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. కొండాయి (Kondai):
కొండాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ గోవిందరాజస్వామి దేవాలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Eturunagaram Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి