ములుగు జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. 2019 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం ఈ జిల్లా కొత్తగా అవతరించింది. (ఫిబ్రవరి 17, 2019 నుంచి జిల్లా పాలన అమలులోకి వచ్చింది). జిల్లాలో 9 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిన పోరిక బలరాం నాయక్, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, తెరాస పార్టీ ప్రతినిధి అయిన వీరమల్ల ప్రకాశ్ ఈ జిల్లాకు చెందినవారు. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయం, రామప్ప చెరువు, అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం ప్రాంతం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, మల్లూరు శ్రీ హేమచల లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఈ జిల్లాలో ఉన్నాయి. గోదావరి నది జిల్లా గుండా ప్రవహిస్తున్నది.
చరిత్ర 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైన ఈ ప్రాంతం 8 సం.ల పాటు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగించి. 1956 నవంబరు 1 నుంచి 2014 జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా వరంగల్, ఖమ్మం జిల్లాలలో కొనసాగింది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. ప్రత్యేక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన రావడంతో డిసెంబరు 31, 2018న ములుగు జిల్లా ఏర్పాటుకు ముసాయిదా ప్రకటన వెలువడింది. 9 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న ములుగు జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు విడుదల చేసింది. జిల్లాలోని మండలాలు ములుగు మండలం, వెంకటాపూర్ మండలం, గోవిందరావుపేట మండలం, తాడ్వాయి (సమ్మక్క సారక్క) మండలం, ఏటూరు నాగారం మండలం, కన్నాయిగూడెం మండలం, మంగపేట మండలం, వెంకటాపురం మండలం, వాజేడు మండలం, ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
16, ఫిబ్రవరి 2019, శనివారం
ములుగు జిల్లా (Mulugu Dist)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి