19, మార్చి 2017, ఆదివారం

వెంకటాపురం మండలం (Venkatapuram)

వెంకటాపురం మండలం
జిల్లాజయశంకర్ జిల్లా
జనాభా38900 (2011)
అసెంబ్లీ నియో.ములుగు అ/ని,
లోకసభ నియో.మహబూబాబాద్ లో/ని,
వెంకటాపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం, రామప్ప సరస్సు మండలంలోని పాలంపేటలో ఉంది. మండల వ్యవస్థకు ముందు ఇది ములుగు తాలుకాలో భాగంగా ఉండేది. ఇది ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది. మండలంలోని పాలంపేట గ్రామం కాకతీయుల కాలంలో రాజధానిగా విలసిల్లింది. రామానుజాపూర్‌లో కాకతీయుల కాలం నాటి పంచకూటాలయం ఉంది. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు.
జిల్లాల పునర్విభజనకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైంది. రెవెన్యూ డివిజన్ కూడా పరకాల నుంచి ములుగు డివిజన్‌లోకి వచ్చింది.
చరిత్ర:
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం వైభవంగా వెలుగొందింది. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధమైన పాలంపేట దేవాలయం, పాలంపేట చెరువు, పంచకూటాలయం మండల పరిధిలో ఉన్నాయి. కాకతీయుల పతనానంతరం కొన్ని దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రారంభంలో వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ మండలం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36559. ఇందులో పురుషులు 18481, మహిళలు 18078.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38900. ఇందులో పురుషులు 19448, మహిళలు 19452.

రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.

మండలంలోని గ్రామాలు:
అడవి రంగాపూర్ (Adavirangapur), తిమ్మాపూర్ (Thimmapur), నర్సాపురం (Narasapuram), నల్లగుంట (Nallagunta), పాలంపేట (Palampeta), బండ్లపహాడ్ (Bandlapahad), రామనాథపల్లి (Ramanathapalle), రామానుజాపూర్ (Ramanujapuram), లక్ష్మీదేవిపేట (Laxmidevipeta), వెంకటాపూర్ (Venkatapur),


విభాగాలు: జయశంకర్ జిల్లా మండలాలు, వెంకటాపురం మండలం, ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక