రఘునాథపల్లి జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 36 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. ఖిలాషాపూర్, కంచన్‌పల్లి, రఘునాథపల్లి మండలంలోని పెద్ద గ్రామాలు. ఖిలాషాపురంలో సర్వాయి పాపన్న నిర్మించిన కోట ఉంది.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. ప్రముఖ తెలుగు కవి పేర్వారం జగన్నాథం, పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రి గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిజిపిగా, ఏపీపీఎస్సీ చైర్మెన్‌గా పనిచేసిన పేర్వారం రాములు ఈ మండలమునకు చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నర్మెట్ట మండలం, ఈశాన్యాన మరియు తూర్పున స్టేషన్ ఘన్‌పూర్ మండలం, ఆగ్నేయాన పాలకుర్తి మండలం, దక్షిణాన దేవరుప్పుల మండలం, నైరుతిన లింగాల ఘన్‌పూర్ మండలం, పశ్చిమాన జనగామ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: మొఘలులకు వ్యతిరేకంగా ఒంటిచేతిలో పోరాడి ముప్పుతిప్పలు పెట్టిన సర్వాయి పాపన్న ఈ మండలంలోని ఖిలాషాపూర్ గ్రామానికి చెందినవాడు. ఆయన నిర్మించిన కోట ఈ గ్రామంలో ఉంది. అంతకుక్రితం ఈ ప్రాంతం కాకతీయుల పాలనలో ఉండేది. ఆధునిక కాలంలో ఈ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీ, నిజాంషాహీలచే పాలించబడి 1948లో నిజాం చెరనుంచి బయటపడి హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది. 2016 అక్టోబరు 11న తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి జనగామ జిల్లాలోకి మారింది. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్, మరియు హైదరాబాదు వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52,876. ఇందులో పురుషులు 26509, మహిళలు 26367. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53171. ఇందులో పురుషులు 26472, మహిళలు 26699. రాజకీయాలు: ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా కాంగ్రె పార్టీకి చెందిన మేకల వరలక్ష్మి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన బొల్లం మణికంఠ ఎన్నికయ్యారు.
రఘునాథపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ashwaraopalli, Bhanjipeta, Fatheshapur, Gabbeta, Govardhanagiri, Ibrahimpur, Kalvalapalli, Kanchanpalli, Kannaipalli, Koduru, Komalla, Kurchapalli, Madharam, Mekalagattu, Nidigonda, Quileshapur, Raghunathpalli, Srimannarayanapur, Veldi
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఖిలాషాపూర్ (Khilashapur):
ఖిలాషాపూర్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు పేర్వారం జగన్నాథం, మాజీ మంత్రి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, 2014లో వరంగల్ జడ్పీ చైర్మెన్‌గా ఎన్నికైన గద్దెల పద్మ ఈ గ్రామానికి చెందినవారు. గ్రామంలో సర్వాయి పాపన్న నిర్మించిన కోట ఉంది. అక్టోబరు 15, 2020న భారీ వర్షాలకు కోటలో కొంతభాగం కూలిపోయింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Raghunathapalli Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి