స్టేషన్ ఘన్‌పూర్ జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. 2014 జూన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పదవి పొందిన తాటికొండ రాజయ్య ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా చిల్పూర్ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన చిల్పూర్ మండలం, తూర్పున జఫర్‌గఢ్ మండలం, దక్షిణాన పాలకుర్తి మండలం, పశ్చిమాన రఘునాథపల్లి మండలం, వాయువ్యాన నర్మెట్ట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్, మరియు హైదరాబాదు వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70540. ఇందులో పురుషులు 35265, మహిళలు 35275. మండలంలో పట్టణ జనాభా 18550, గ్రామీణ జనాభా 73933. రాజకీయాలు: ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కందుల రేణుక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మారపాక రవి ఎన్నికయ్యారు.
స్టేషన్ ఘన్‌పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chagal, Ghanpur (Stn), Ippagudem, Kothapalli, Meedigonda, Namilakonda, Pamunuru, Raghavapur, Samudrala, Shivunipalli, Thanadarpalli, Thatikonda, Vishwanathpur,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
స్టేషన్ ఘన్‌పూర్ (Ghanpur Station): స్టేషన్ ఘన్‌పూర్ జనగామ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన తాటికొండ రాజయ్య ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Station Ghanpur Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి