మర్పల్లి మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. వికారాబాదు నుంచి పర్లి వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం వికారాబాదు జిల్లాలో అతి ఉత్తరాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన మరియు పశ్చిమాన సంగారెడ్డి జిల్లా, తూర్పున మోమిన్‌పేట మండలం, దక్షిణాన కోట్‌పల్లి మండలం, నైరుతిన బంట్వారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 45827. ఇందులో పురుషులు 23450, మహిళలు 22377. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50972. ఇందులో పురుషులు 25742, మహిళలు 25230. అక్షరాస్యుల సంఖ్య 26448. రాజకీయాలు: ఈ మండలం వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన బట్టు లలిత ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు: అల్లాపుర్ (Allapur), బిల్కల్ (Bilkal), బూచన్‌పల్లి (Buchanpalli), దమస్తాపూర్ (Damasthapur), దర్గుపల్లి (Dargulpalli), ఘన్‌పూర్ (Ghanpur), గుండ్లమర్పల్లి (Gundlamarpalli), జంషెడపూర్ (Jamshedapur), కల్కోడ (Kalkoda), కొంషెట్టిపల్లి (Komshetpalli), కొత్లాపూర్ (Kothlapur), కోట్‌మర్పల్లి (Kotmarpalli), కుడ్‌గుంత (Kudgunta), మల్లికార్జున్‌గిరి (Mallikarjungiri), మర్పల్లి కలాన్ (Marpalli Kalan), మొగిలిగుండ్ల (Mogiligundla), నర్సాపూర్ (Narsapur), పంచలింగాల (Panchalingal), పట్లూర్ (Patloor), పెద్దాపూర్ (Peddapur), పిల్లిగుండ్ల (Pilligundla), రామాపూర్ (Ramapur), రావలపల్లి (Ravalpalli), షాపూర్ (Shapur), సిరిపురం (Sirpura), తిమ్మాపూర్ (Thimmapur), తుమ్మలపల్లి (Thummalapalli), వేర్లపల్లి (Veerlapalle)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి