రాజకీయ ఉద్యమకారిణి, రాజకీయ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలైన కల్వకుంట్ల కవిత మార్చి 13, 1978న కరీంనగర్‌లో జన్మించారు. తండ్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, భర్త దేవన్‌పల్లి అనిల్.
కవిత తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటుచేసి ఉద్యమ కార్యకలాపాలలో ప్రముఖ పాత్రవహించారు. 2001 లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందిన కవిత 2014 లో నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఎన్నికైనారు. 2019లో మళ్ళీ నిజామాబాదు నుంచి పోటీచేసి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 2020 అక్టోబరులో ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. బతుకమ్మ పండుగ సమయంలో ప్రధాన నగరాలలో పాల్గొని మహిళలను ఉత్తేజపరుస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి ఉద్యమకారులకు కూడా స్పూర్తినిచ్చారు. ఈమె సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇవి కూడా చూడండి:
(గమనిక: ఈ సమాచారం తేది 15-10-2020 నాటికి తాజాకరించబడింది)
= = = = =
|
Tags:kalwakuntla kavitha in telugu, Daughter of KCT, brother of KTR, Nizamabad MP, born in Karimnagar, Telangaa Jgruthi Samstha, telangana movement leaders, bathukamma,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి