వేములపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ప్రముఖ రాజకీయ నాయకుడు చకిలం శ్రీనివాసరావు ఈ మండలమునకు చెందినవారు. కాకతీయుల కాలంలో సామంతరాజ్య రాజధానిగా ఉన్న ఆమనగల్ ఈ మండలంలోనే ఉంది. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2016 జిల్లాల పునర్విభజన సమయంలో మండలంలోని 10 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన మాడుగులపల్లి మండలంలో కలిపారు. ప్రస్తుతం మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు కలవు.
సరిహద్దులు: ఈ మండలం నల్గొండ జిల్లాలో తూర్పువైపున సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి దక్షిణాన మిర్యాలగూడ మండలం, పశ్చిమాన మాడుగులపల్లి మండలం, ఉత్తరాన కేతెపల్లి మండలం, తూర్పున సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం తూర్పు సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43003. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44460. ఇందులో పురుషులు 22295, మహిళలు 22165. మండలంలోని గ్రామాలు: Amanagallu, Annapureddy Guda, Buggabaviguda, Chalichimalapalem, Itikyala, Kamepally, Molkapatnam, Mundlapadu, Ravulapenta, Salkunoor, Settipalem, Thimmareddygudem, Vemulapally
ముఖ్యమైన గ్రామాలు
ఆమనగల్లు (Amangal):ఈ గ్రామం కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందినది. కాకతీయ సామతరాజులకు రాజధానిగా కూడా పనిచేసిన ఈ గ్రామంలో అప్పటి శిల్పకళా నైపుణ్యాలు దర్శనమిస్తాయి. ఈ గ్రామం రేచర్ల రెడ్డి వంశీయులకు జన్మస్థానంగా కూడా చెప్పబడుతుంది. వేములపల్లి (Vemulapally): ప్రముఖ రాజకీయ నాయకుడు చకిలం శ్రీనివాసరావు ఈ గ్రామమునకు చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Vemulapalli Vemulapally Mandal Amangal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి