గుండ్లపల్లి (డిండి మండలం) నల్గొండ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామపంచాయతీలు కలవు. ప్రముఖ కవి కందుకూరు రుద్రకవి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో డిండినదిపై డిండి ప్రాజెక్తు నిర్మించబడింది. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: నల్గొండ జిల్లాలో ఈ మండలం అతి పశ్చిమాన ఉంది. ఈ మండలానికి ఈశాన్యాన దేవరకొండ మండలం, తూర్పున చందంపేట మండలం, మిగితా వైపులా నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా డిండినది ప్రవహిస్తోంది. ఈ నదిపై మండల పరిధిలోనే డిండి ప్రాజెక్టు ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41677, 2011 నాటికి జనాభా 4681 పెరిగి 46358 కు చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46358. ఇందులో పురుషులు 23209, మహిళలు 23149. రవాణా సౌకర్యాలు: మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది. హైదరాబాదు, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ వెళ్ళు రహదారులు ఈ కూడలి వద్ద ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: గుండ్లపల్లి (Gundlapally), గోనకల్ (Gonakal), బొగ్గులదోన (Bogguladona), చెరుకుపల్లి (Cherukupally), బుర్హాన్‌పూర్ (Burahanpur), కుతున్‌షాపూర్ (Kuthubshapur), గుండాల తిప్పర్తివనిపల్లి (Gundala Thipparthivanipally), బొల్లనపల్లి (Bollanapally), తిప్పలనేని గౌరారం (Thippalaneni Gowraram), ఎల్లారం (Yerraram), కామదేని గౌరారం (Kamadheni Gowraram), గోనబోయిన్‌పల్లి (Gonaboinapally), కామేపల్లి (Kamepally), దాసరి నేమిలిపూర్ (Dasari Nemilipur), వావికోల్ (Vavilkole), బ్రాహ్మణపల్లి (Brahmanapally), వీరబోయిన్‌పల్లి (Veeraboinapally), సింగరాజుపల్లి (Singarajupally), తౌక్లాపూర్ (Thowklapur), రహమంతాపూర్ (Rahamanthapur), ఖానాపూర్ (Khanapur), కందుకూర్ (Kandukur)
ప్రముఖ గ్రామాలు
కందుకూరు (Kandukur):ప్రముఖ కవి మల్కిభరాయుని కాలంలోని కందుకూరు రుద్రకవి ఈ గ్రామానికి చెందినవారే. 1972లో దేవరకొండ శాసనసభ్యుడిగా ఎన్నికైన బొడ్డుపల్లి రామశర్మ ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Dindi Project Dindi Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి