కేతెపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. చెందిన మండలము. 9వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల పరిధిలో మూసీనదిపై మూసీ రిజర్వాయర్ నిర్మించారు. మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామపంచాయతీలు కలవు. మార్చి 2018లో రాజ్యసభకు ఎన్నికైన బడుగుల లింగయ్య యాదవ్ ఈ మండలానికి చెందినవారు. ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజన్, నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం నల్గొండ జిల్లాలో తూర్పు భాగంలో సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు పశ్చిమాన నక్రేకల్ మండలం, దక్షిణాన మాడుగులపల్లి మరియు వేములపల్లి మండలాలు, నైరుతిన తిప్పర్తి మండలం, తూర్పున సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండల తూర్పు సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తుంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 34844. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 37441. ఇందులో పురుషులు 18765, మహిళలు 18676. రవాణా సౌకర్యాలు: 65వ నెంబరు (పాతపేరు 9) జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండలంలోని గ్రామాలు: Bandapalem, Bheemaram, Bopparam, Cherkupally, Gudiwada, Inupamula, Ippalaguda, kasangode, Kethepally, Koppole, Korlapahad, Thungathurthy, Uppalapahad
ప్రముఖ గ్రామాలు
భీమారం (Bheemaram):భీమారం నల్గొండ జిల్లా కేతెపల్లి మండలానికి చెందిన గ్రామము. మార్చి 2018లో ఈ గ్రామానికి చెందిన బడుగుల లింగయ్య యాదవ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Musi Project Kethepalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి