చందంపేట నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది నల్గొండ దేవరకొండ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. ఈ మండలము కృష్ణానది తీరంలో ఉంది. జిల్లాలో అతి దక్షిణాన ఉన్న మండలం కూడా ఇదే. మండలంలోని అనేక గ్రామాలు నాగార్జునసాగర్ జలాశయానికి అతి సమీపంలో ఉన్నాయి (బ్యాక్ వాటర్ పరిధిలో ఉన్నాయి). మండలం వెనుకబడిన ప్రాంతమైననూ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. పెద్ద మునిగల్, చిన్న మునిగల్ గ్రామ శివార్లలో ముత్యాలమ్మ, గోపాలస్వామి ఆలయాలున్నాయి.
జిల్లాల పునర్విభజన సమయంలో మండలంలోని 8 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన నేరెడుగొమ్ము మండలంలో కలిపారు. అదేసమయంలో ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి కొత్తగా ఏర్పాటుచేసిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరింది. సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నేరెడిగొమ్ము, పెద్దఆదిశర్లపల్లి మండలాలు, పశ్చిమాన గుండ్లపల్లి మండలం, వాయువ్యాన దేవరకొండ మండలం, దక్షిణాన మరియు ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49834. , 2011 నాటికి జనాభా 1443 పెరిగి 51277కు చేరింది. ఇందులో పురుషులు 26779, మహిళలు 24498. స్త్రీపురుష నిష్పత్తి 915/ప్రతి వెయ్యి పురుషులకు. మండలంలోని గ్రామాలు: Achampet(P) Chandampet, Bollaram - P - Munagal, Chandampet, Chitriyala, Gagillapur, Guntipally, Kambhalapally, Mududandla, Murpunuthala, Pogilla Polepally - Gannerpalli, Rekula Valyam, Rekulagadda, Teldevarapally, Yalmalamanda ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Chandampet Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి