నేరెడుగొమ్ము నల్గొండ జిల్లాకు చెందిన మండలము. చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. చందంపేట మరియు పెద్ద ఆదిశర్లపల్లి మండలాలలోని 9 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలంం దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ మండలానికి చెందినవారు. కృష్ణానది బ్యాక్‌వాటర్ వల్ల వరదల సమయంలో చాలా గ్రామాలు ముంపునకు గురౌతాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కొండమల్లేపల్లి మండలం, తూర్పున మరియు ఈశాన్యాన పెద్ద ఆదిశర్లపల్లి మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన చందంపేట మండలం, వాయువ్యాన దేవరకొండ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ప్రముఖ రాజకీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ మండలానికి చెందినవారు. మండలంలోని గ్రామాలు: Bachapoor, Dasarlapally, Kacharajupally, Kethapally - P - Perwala, Kothapally, Neredugommu, Pedda Munigala, Perwala, Thimmapoor ప్రముఖ గ్రామాలు ఈ గ్రామంలో చారిత్రక అవశేషాలు లభించాయి. గాజుబేడ గుట్టలలోని గుహలలో పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేశారు. నేరెడిగొమ్ము (Neredigommu):
నేరెడిగొమ్ము నల్గొండ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ గ్రామం కొత్తగా మండలకేంద్రం అయింది. అంతకుక్రితం చందంపేట మండలంలో ఉండేది. తలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Neredugommu Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి