22, జనవరి 2013, మంగళవారం

అమ్రాబాదు మండలం (Amrabad Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ అచ్చంపేట
జనాభా48359 (2001)
49204 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుప్రత్తి
మండల ప్రముఖులు
అమ్రాబాదు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016కు ముందు ఇది ఉమ్మడీ మహబూబ్‌నగర్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా ఉండేది. జిల్లాలో ఆగ్నేయాన ఉన్న ఈ మండలము నల్లమల అడవీ ప్రాంతంలోకి వస్తుంది. ఈ మండలము నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49204. ప్రముఖ కవి చేపురు పెద్దలక్ష్మయ్య ఈ మండలమునకు చెందినవారు. రాయనిగండి వద్ద 2500 సంవత్సరాల క్రితం నాటి సమాధులు బయటపడ్డాయి.

2016 అక్టోబరు 11న ఈ మండలం నుంచి 7 గ్రామాలను విడదీసి పదర మండలాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు కలవు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48359. ఇందులో పురుషులు 24627, మహిళలు 23732.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49204. ఇందులో పురుషులు 24767, మహిళలు 24437. పట్టణ జనాభా 4450, గ్రామీణ జనాభా 44754. జనాభాలో ఇది జిల్లాలో 51వ స్థానంలో ఉంది.

మండల సరిహద్దులు:
ఈ మండలము జిల్లాలో ఆగ్నేయాన ఉంది. ఉత్తరాన అచ్చంపేట మండలం సరిహద్దుగా ఉండగా మిగితా అన్నివైపులా కొత్తగా ఏర్పడిన పదర మండలం సరిహద్దుగా ఉంది..

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలంనుంచి వెళ్ళుచున్నది.

అచ్చంపేట నియోజకవర్గంలో
అమ్రాబాదు మండల స్థానం (పసుపు రంగు)
రాజకీయాలు:
అమ్రాబాదు మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జల్లా రాధ ఎన్నికయ్యారు.2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 18 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 12, తెలుగుదేశం పార్టీ 6 పంచాయతీలలో విజయం సాధించాయి. 2014లో ఎంపిపిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంచంద్రమ్మ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 61 ప్రాథమిక పాఠశాలలు (23 ప్రభుత్వ, 34 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 11 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 15 ఉన్నత పాఠశాలలు (7 ప్రభుత్వ, 5 జడ్పీ, 3 ప్రైవేట్), 2 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 1 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 104929హెక్టార్లలో 7% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 75% భూమి అటవీ ప్రాంతము. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి.  వరి. మొక్కజొన్న, కందులు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 756 మిమీ. మండలంలో సుమారు 1000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2002, డిసెంబరు 28: అమ్రాబాదు మండలం మద్దిమడుగులో మావోయిస్టుల కాల్పులలో నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్ మరణించారు.
  • 2014, జూలై 4: ఎంపిపిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంచంద్రమ్మ ఎన్నికయ్యారు. 
  • 2014, నవంబరు 15: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య మండలంలో పర్యటించారు. 
  • 2016, అక్టోబరు 11: పునర్వ్యవస్థీకరణ ఫలితంగా అమ్రాబాదు మండలంలోని 7 గ్రామాలు వేరు చేసి పదర మండలాన్ని ఏర్పాటుచేశారు.


అమ్రాబాదు మండలంలోని గ్రామపంచాయతీలు
1.అమ్రాబాదు7.జంగంరెడ్డిపల్లి13.మారడుగు
2.ఇప్పలపల్లి8.తిర్మలాపూర్ (బికె)14.మున్ననూరు
3.ఉడిమిల్ల9.తుర్కపల్లి15.లక్ష్మాపూర్ (బికె)
4.కల్వనోనిపల్లి10.పద్ర16.వంకేశ్వరం
5.కుమ్మరోన్ పల్లి11.మాచారం17.వటవర్లపల్లి
6.చిట్లంకుంట12.మాదవన్ పల్లి18.వెంకటేశ్వర్లబావి


విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా మండలాలు,  అమ్రాబాదు మండలము,  నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట్ అసెంబ్లీ నియోజకవర్గం,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011,
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు, 

2 కామెంట్‌లు:

  1. నమస్కారములు... మీ సైట్ చాలా అద్భుతముగా ఉన్నది... మీరు చర్చించే విషయాలు చాలా భాగున్నాయి. అధే విధముగా మీరు ఒకమారు మా వెబ్ సైట్ ఒకమారు పరిశీలించగలరు....
    మీ సైట్ నందు కర్సర్ వెంట పేరు రావడము భాగుంది. దయచేసి దాని కోడ్ ను మాకు పంపవలసినదిగా విన్నపము.
    www.maddimadugu.weebly.com

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక