22, జనవరి 2013, మంగళవారం

ఆమనగల్లు మండలం (Amangal Mandal)

జిల్లా రంగారెడ్డి
రెవెన్యూ డివిజన్కందుకూరు
జనాభా54339 (2001)
62113 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకల్వకుర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న, ప్రత్తి
మండల ప్రముఖులు
ఆమనగల్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము కందుకూరు రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గము, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గములో భాగము. హైదరాబాదు- శ్రీశైలం రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ప్రముఖమైన మైసిగండి మైసమ్మ దేవాలయం మండలంలో ఉంది. 2001 లెక్కల ప్రకారము మండల జనాభా 54339. స్వాతంత్ర్య సమరయోధుడు చింతోజు రామకృష్ణయ్య, సాహితీవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి, కవి మరింగంటి రంగకృష్ణమాచార్యులు ఈ మండలమునకు చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 54339. ఇందులో పురుషులు 28265, మహిళలు 26074.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62113. ఇందులో పురుషులు 32291, మహిళలు 29822. జనాభాలో ఇది జిల్లాలో 24వ స్థానంలో ఉంది. స్త్రీపురుష నిష్పత్తిలో (924/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి నుంచి రెండవ స్థానంలో ఉంది.

మండల సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాబ కడ్తాల్ మండలం, తూర్పున మాడ్గుల్ మండలం, పశ్చిమాన తలకొండపల్లి మండలం, దక్షిణాన నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలంలోని కడ్తాల్, ఆమనగల్ మీదుగా వెళ్ళుచున్నది. అలాగే షాద్ నగర్ నుంచి ఆమనగల్ కు రోడ్డుసౌకర్యం ఉంది.

కల్వకుర్తి నియోజకవర్గంలో
ఆమనగల్ మండల స్థానం (ఆకుపచ్చ రంగు)
రాజకీయాలు:
ఈ మండలము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకూర లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.


వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 31863 హెక్టార్లలో 41% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి. వరి, కందులు, జొన్నలు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 607 మిమీ. మండలంలో సుమారు 3600 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2003, ఏప్రిల్ 18: ఆమనగల్ బస్టాండ్ ప్రారంభించబడింది.
  • 2007: మైసిగండిలో ఆమనగల్లు మండలాధ్యక్షుడు ఎంపిపిపంతునాయక్‌ను హత్యచేశారు. 
  • 2013, మే 30: మేడిగడ్డతాండా సమీపంలో శ్రీశైలం-హైదరాబాదు ప్రధానరహదారిపై ఆర్టీసి బస్సు-ఆటో ఢోకొని నలుగురు మరణించారు.వీరు వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందినవారు.
  • 2016, అక్టోబరు 11న ఈ మండలం మహబూబ్‌నగర్ నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కలిసింది.అదే సమయంలో రెవెన్యూ డివిజన్ కూడా మహబూబ్‌నగర్ నుంచి కందుకూరులో చేరింది




ఫోటో గ్యాలరి
2016కు ముందు మహబూబ్‌నగర్ జిల్లాలో
ఆమనగల్ మండల స్థానం






విభాగము: ఆమనగల్ మండలంలోని గ్రామాలు
(Portal: Villages in Amangal Mandal)
Amangal, Vithaipalli, Konapur, Ramanuthula, Chennampalli, Akuthotapalli, Singam Palli, Polepalli, Settipalli,


విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలుఆమనగల్ మండలము,  మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత పర్యటించి, తెలుసుకున్న విషయాలు, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక