24, జనవరి 2013, గురువారం

పెద్దకొత్తపల్లి మండలము (Pedda Kotha Pally Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూల్
జనాభా50051 (2001)
54767 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకొల్లాపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులు
పెద్దకొత్తపల్లి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. మండల జనాభా కోడ్ 0051. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54767. మండలం 78° 21'50" తూర్పు రేఖాంశం, 16° 16'4" ఉత్తర అక్షాంశంపై ఉన్నది. మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. 2013లో భాజపా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పద్మజారెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
మండలం 78డి 21'50" తూర్పు రేఖాంశం, 16డి 16'4" ఉత్తర అక్షాంశంపై ఉన్నది. ఈ మండలమునకు ఉత్తరమున నాగర్ కర్నూల్ మండలము, తూర్పున టెల్కపల్లి, లింగాల మండలములు, దక్షిణమున కొల్లాపుర్ మండలము, పశ్చిమాన కోడేరు మండలము, వాయువ్యాన గోపాలపేట మండలము సరిహద్దులుగా ఉన్నాయి

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 50051. ఇందులో పురుషులు 25730, మహిళలు 24321. ఎస్సీల సంఖ్య 11462. ఎస్టీల సంఖ్య 1857. జనసాంద్రత 123/చకిమీ. స్త్రీపురుష నిష్పతి 945. అక్షరాస్యత శాతం 33.94%.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54767. ఇందులో పురుషులు 28055, మహిళలు 26712. జనాభాలో ఇది జిల్లాలో 35వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపుర్ వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో
పెద్దకొత్తపల్లి మండల స్థానం (నీలం రంగు)
రాజకీయాలు:
ఈ మండలము కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006లో జడ్పీటీసిగా కళావతమ్మ, మండల అధ్యక్షులుగా ఎం.లక్ష్మయ్యగౌడ్ ఎన్నికయ్యారు. 2014లో పెద్దకొత్తపల్లి ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన వెంకటేశ్వర్ రావు ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
మండలంలో 2008-09 నాటికి 39 ప్రాథమిక పాఠశాలలు (ప్రభుత్వ 1, మండల పరిషత్తు 35, ప్రైవేట్ 3), 8 ప్రాథమికోన్నత పాఠశాలలు (మం.ప.6, ప్రైవేట్ 2). 10 ఉన్నత పాఠశాలలు (ప్రభుత్వ 1, జిల్లా పరిషత్తు 8, ప్రైవేట్ 1), ఒక జూనియర్ కళాశాల ఉంది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 33301 హెక్టార్లలో 26% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వరి, కందులు, జొన్నలు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 625 మిమీ. మండలంలో సుమారు 1000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 

పెద్దకొత్తపల్లి మండల రెవెన్యూ కార్యాలయము


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  పెద్దకొత్తపల్లి మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

1 వ్యాఖ్య:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక