24, జనవరి 2013, గురువారం

తెల్కపల్లి మండలము (Telkapally Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్‌కర్నూల్
జనాభా
49559 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
తెలకపల్లి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఇది నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు. మండలపు జనాభా కోడ్ 0033. 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44100. మహబూబ్‌నగర్ - శ్రీశైలం ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. రచయిత గన్నోజు శ్రీనివాసచారి ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం 78డి 26' 13" తూర్పు రేఖాంశం, 16డి 26' 31" ఉత్తర అక్షాంశంపై ఉన్నది. మండల వైశాల్యం 243.39 చకిమీ. ఈ మండలమునకు ఉత్తరమున తాడూరు మండలము, దుందుభీనది దానికి ఆవల కల్వకుర్తి, వంగూరు మండలములు, తూర్పున ఉప్పునూతల, బల్మూరు మండలములు, దక్షిణమున లింగాల, పెద్దకొత్తపల్లి మండలములు, పశ్చిమాన నాగర్ కర్నూల్ మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44100. ఇందులో పురుషులు 22410, మహిళలు 21690. ఎస్సీల సంఖ్య 11816, ఎస్టీల సంఖ్య 791. జనసాంద్రత 180/చకిమీ, స్త్రీపురుష నిష్పత్తి 965.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49559. ఇందులో పురుషులు 24945, మహిళలు 24614. జనాభాలో ఇది జిల్లాలో 50వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్ నగర్ శ్రీశైలం రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. నాగర్ కర్నూల్, అచ్చంపేటల మధ్య ఉండుటచే రహదారి వాహన సౌకర్యం బాగుగా ఉన్నది. మండలం నుంచి లింగాల, కల్వకుర్తిలకు కూడా రహదారి ఉంది.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో
తెలకపల్లి మండల స్థానం (నీలం రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.రేవతమ్మ విజయం సాధించారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 24 ప్రాథమిక పాఠశాలలు (21 మండల పరిషత్తు, 3 ప్రైవేట్). 13 ప్రాథమికోన్నత పాఠశాలలు (12 మం.ప, 1 ప్రైవేట్), 12 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ, 5 ప్రైవేట్), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 24118 హెక్టార్లలో 78% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి. వరి, వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 594 మిమీ. మండలంలో సుమారు 1000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 

టెల్కపల్లి గ్రామపంచాయతి కార్యాలయము


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు, తెలకపల్లి మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక