4, ఫిబ్రవరి 2013, సోమవారం

సరోజినీ పుల్లారెడ్డి (Sarojini Pulla Reddy)

జననంఫిబ్రవరి 22, 1923
పదవులుహైదరాబాదు మేయరు, రాష్ట్ర మంత్రి,
మరణంఫిబ్రవరి 3, 2013
సరోజినీ పుల్లారెడ్డి మహబూబ్ నగర్ లో 1923 ఫిబ్రవరి 22న జన్మించి హైదరాబాదులో స్థిరపడి రాజకీయంగా పలు పదవులు పొంది ప్రజాసేవ చేసిన నాయకురాలు. 1944లో డాక్టర్ పుల్లారెడ్డితో వివాహమైంది. పులారెడ్డికి ఇది ద్వితీయ వివాహం. వీరికి ఒక కుమారుడు. 1971లో భర్త పుల్లారెడ్డి, ఆతర్వాత కుమారుడు అశోక్ రెడ్డి, మనవడు మరణించారు. రాజకీయాలలో సామాన్య కార్యకర్తగా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాదు నగర మేయరుగా, రాష్ట్ర మంత్రిగా, CWC సభ్యురాలిగా, రాష్ట్ర కాంగ్రెసుపాధ్యక్షురాలిగా పలు పదవులు నిర్వహించారు. 85సం.ల వయస్సులో ఫిబ్రవరి 3, 2013న మరణించారు.

రాజకీయ ప్రస్థానం
1960లో రాజకీయాలలో ప్రవేశించి, 1965లో బతుకమ్మకుంట (ప్రస్తుత మెట్టుగడ్డ) నుంచి కార్పోరేటరుగా విజయం సాధించారు. అదే ఏడాది హైదరాబాదు నగర మేయరుగా పదవిపొందినారు. 1967లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.1975లో HUDA ఏర్పాటైన పిదప ఆ సంస్థకు తొలి చైర్మెన్ గా పదవి స్వీకరించారు. 1978లో శాసనసభకు పోటీచేసి జనతాపార్టీ అభ్యర్థి కె.ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం పొందినారు. ఓటమి చెందిననూ ఇందిరాగాంధీతో సన్నిహితంగాఉన్నందున ఎమ్మెల్సీ పదవి లభించింది. చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల మంత్రివర్గాలలో కూడాస్థానం పొందారు. 1983 పురపాలక సంస్థ ఎన్నికలలో హైదరాబాదు శివారులోని 12 పురపాలక సంఘ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించింది పదింటిని గెలిపించారు. 2000లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా పదవి పొందినారు. 85సం.ల వయస్సులో ఫిబ్రవరి 3, 2013న మరణించారు.

ఇవి కూడా చూడండి:
హోం
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, హైదరాబాదు నగర మేయర్లు, 4వ శాసనసభ సభ్యులు, మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు, 1923లో జన్మించినవారు,  2013లో మరణించినవారు,




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక