బయ్యారం మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. మండల కేంద్రంలో కాకతీయుల కాలం నాటి శివాలయం, బయ్యారం పెదచెరువు ఉన్నాయి. మండలంలో ఇనుప గనులు, అడవులు అధికంగా ఉన్నాయి.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో తూర్పువైపున భద్రాద్రి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గంగారాం మండలం, పశ్చిమాన మహబూబాబాదు మండలం, దక్షిణాన గార్ల మండలం, నైరుతిన కురవి మండలం, వాయువ్యాన గూడూరు మండలం, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42688. ఇందులో పురుషులు 21325, మహిళలు 21363.
రాజకీయాలు:
ఈ మండలము ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందినసీహెచ్ మౌనిక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన అంగోతు బిందు ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bayyaram, Dharmapuram, Gandhampalli, Gowraram, Gurimella, Irsulapuram, Jagathraopet, Kachanapalli, Kambalapalli, Kommavaram, Kothapeta, Lingagiri, Motlathimma Puram, Ramachandra Puram, Singaram, Uppalapadu, Venkatapuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బయ్యారం (Bayyaram): బయ్యారం ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ 15వేల ఎకరాలకు సాగు నీరు అందించే బయ్యారం పెద్ద చెరుగు, అక్కడే కాకతీయుల శిలాశాసనం ఉంది. బయ్యారం గ్రామంలో కాకతీయులు నిర్మించిన శివాలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Warangal Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి