26, జూన్ 2013, బుధవారం

పెండేకంటి వెంకటసుబ్బయ్య (Pendekanti Venkatasubbaiah)

 పెండేకంటి వెంకటసుబ్బయ్య
జననంజూన్ 18, 1921
స్వస్థలంసంజామల (కర్నూలు జిల్లా)
పదవులు4 సార్లు ఎంపి, కేంద్రమంత్రి, కర్ణాటక గవర్నరు, బీహార్ గవర్నరు,
నియోజకవర్గంనంద్యాల
మరణంఅక్టోబరు 12, 1993
పెండేకంటి వెంకటసుబ్బయ్య కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వెంకటసుబ్బయ్య జూన్ 18, 1921న కర్నూలు జిల్లా సంజామల గ్రామంలో జన్మించారు. అభ్యసన దశలోనే జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. స్వాతంత్ర్యానంతరం నంద్యాల లోకసభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికవడమే కాకుండా కేంద్రమంత్రిగా, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. 1993లో పెండేకంటి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1949లో తొలిసారిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1967, 1971లలో నంద్యాల లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1977లో జనతాపార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత 1978 ఉప ఎన్నికలో మళ్ళీ విజయం సాధించారు. 1980లో 7వ లోకసభకు కూడా ఎన్నికై మొత్తం 4 సార్లు ఎంపీగా వ్యవహరించారు. 1980-84 కాలంలో కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1988 నుంచి ఫిబ్రవరి 1990 వరకు కర్ణాటక గవర్నరుగా, మార్చి 1995 నుంచి ఫిబ్రవరి 1998 వరకు బీహార్ గవర్నరుగా పనిచేశారు.



విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, కర్నూలు జిల్లా సమరయోధులు, 4వ లోకసభ సభ్యులు, 5వ లోకసభ సభ్యులు, 6వ లోకసభ సభ్యులు, 7వ లోకసభ సభ్యులు, నంద్యాల లోకసభ నియోజకవర్గం, 1921, 1993,


 = = = = =

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక