24, జూన్ 2013, సోమవారం

విజయశాంతి (Vijayashanthi)

 విజయశాంతి
జననంజూన్ 24, 1964
రంగంసినీనటి, రాజకీయ నాయకురాలు,
పదవులుఎంపి (2009-14)
నియోజకవర్గంమెదక్ లో/ని,
తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటిగా పేరుగాంచిన విజయశాంతి జూన్ 24, 1964న వరంగల్‌లో జన్మించింది. విజయశాంతి అసలు పేరు శాంతి. తన పిన్ని విజయలలిత పేరు నుండి విజయ పేరు గ్రహించబడింది. విజయశాంతిని కథానాయికగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా "కల్లుక్కుళ్ ఈరమ్" హీరోయున్‌గా విజయశాంతికి తొలి సినిమా. 1980లో విడుదలైన కిలాడి కృష్ణుడు తెలుగులో ఈమెకు తొలి చిత్రం. 
 
విజయశాంతి కధానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983 లో నిర్మించిన "నేటి భారతం". అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూడలేదు. క్రమక్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టు అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో అగ్రస్థాయికి చేరింది. 
 
7 భాషలలో కలిపి 180కి పైగా చిత్రాలలో నటించిన విజయశాంతి దక్షిణభారత సినీరంగంలో "లేడి సూపర్ స్టార్"గా ప్రసిద్ధి చెందింది. 1991లో కర్తవ్యం సినిమాలో నటనకుగాను ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డు, 4 సార్లు నంది అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది.

రాజకీయ ప్రస్థానం:
విజయశాంతి ప్రారంభంలో భారతీయ జనతాపార్టీలో చేరి భారతీయ మహిళా మోర్చా కార్యదర్శి పదవి పొందినది. 1999లో సోనియాగాంధికి పోటీగా కడప నుంచి లోకసభకు పోటీ చేయడానికి విజయశాంతి పేరు ప్రతిపాదించబడింది. అయితే సోనియా కర్ణాటకలోని బళ్ళారి నుంచి పోటీ చేయడంతో ఈమె పోటీచేయలేదు. తర్వాత భాజపా నుంచి బయటకు వెళ్ళి "తల్లి తెలంగాణ పార్టీ" స్థాపించి, కొంతకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది. 2009లో మెదక్ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున లోకసభకు పోటీచేసి విజయం సాధించింది. జూలై 31, 2013న తెరాస నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి మెదక్ నుంచి చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిననూ చురుకుగా లేరు. డిసెంబరు 7, 2020న మళ్ళీ భాజపాలో చేరారు

వ్యక్తిగత జీవితం:
ఈమె భర్త శ్రీనివాస్ ప్రసాద్. ఈమె పెళ్ళి గురించి సినీపరిశ్రమలో తప్ప బాహ్యప్రపంచానికి ఎక్కువగా తెలియదు. ఇప్పటికీ వీరిద్దరు బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.
 
 



విభాగాలు: తెలుగు సినీనటులు, వరంగల్,  15వ లోకసభ సభ్యులు, మెదక్ లోకసభ నియోజకవర్గం, నంది అవార్డు గ్రహీతలు, 1964, 

 = = = = =

about Vijayashanthi in Telugu, biography of Vijayashanthi

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక