16, జూన్ 2013, ఆదివారం

విజయనగరం లోకసభ నియోజకవర్గం (Vizianagaram Loksabha Constituency)

విజయనగరం లోకసభ నియోజకవర్గం
జిల్లావిజయనగరం, శ్రీకాకుళం
ప్రస్తుత ఎంపిబెల్లాన చంద్రశేఖర్
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజనలో ఇది నూతనంగా ఏర్పడింది. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన బెల్లాన చంద్రశేఖర్ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-14 బొత్స ఝాన్సీలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 అశోక గజపతిరాజు తెలుగుదేశం పార్టీ
17వ 2019-
బెల్లాన చంద్రశేఖర్
వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బొత్స ఝాన్సీ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కె.అప్పలనాయుడుపై 60571 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. బొత్సఝాన్సీ 411584 ఓట్లు పొందగా, అప్పలన్యుడుకు 351013 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కె.గణపతిరావు 172034 ఓట్లతో 3వ స్థానం, భాజపా అభ్యర్థి పి.సన్యాసిరాజు 25239 ఓట్లతో 4వ స్థానం పొందారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు తన సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన బేబీనాయన (రంగారావు)పై 107425 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అశోకగజపతికి 5లక్షల36వేలకు పైగా ఓట్లు రాగా రంగారావుకు 4లక్షల 29 వేల ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన బొత్స ఝాన్సీలక్ష్మి లక్షా 22 వేల ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన బెల్లాన చంద్రశేఖర్, తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన పూసపాటి అశోక గజపతిరాజుపై 48,036 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 5,78,418 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,30,382 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన ముక్కా శ్రీనివాసరావు 34,192 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: విజయనగరం జిల్లా నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాలు, విజయనగరం లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు, 


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక