భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. భద్రాచలం ప్రముఖ శ్రీరామక్షేత్రం. ఈ మండలము భద్రాచలం రెవెన్యూ డివిజన్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఈ మండలము గోదావరి నదికి ఉత్తరాన ఉంది. శ్రీరామనవమిని ఇక్కడ వైభవంగా జరుపుకుంటారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం మండల కేంద్రం మినహా మిగితా గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ప్రస్తుతం ఈ మండలంలో ఒక్కగ్రామం మాత్రమే ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భద్రాచలం మండలానికి పశ్చిమాన బూర్గుంపాడు మండలం ఉండగా మిగితా అన్నివైపులా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉంది. పశ్చిమ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. చరిత్ర: భద్రాచలంకు త్రేతాయుగం నాటి చరిత్ర ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్లుగా, రావణాసురుడు సీతను అపహరించిన ప్రాంతం ఇక్కడే ఉన్నట్లుగా రామాయణం ద్వారా తెలుస్తోంది. 1947వరకు ఈ ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో, 1953లో ఆంధ్రరాష్ట్రంలో, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరింది. ఖమ్మం జిల్లాలో చేర్చడానికి ముందు ఇది తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. 2014లో తెలంగాణ అవతరణ సమయంలో మండలకేంద్రం మినహా మండలంలోని మిగితా గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. 2016లో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో భద్రాచాలం కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైంది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 77,960. ఇందులో పురుషులు 39330, మహిళలు 38630. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 89077. (పునర్విణజనకు ముందు)
రాజకీయాలు:
ఈ మండలము భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన మహ్మద్ తహశీల్ 1955, 1962లలో భద్రాచలం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
భద్రాచలం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
భద్రాచలం (Bhadrachalam): భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము.భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రము. భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. భద్రాచలంలో ప్రసిద్ధి చెందిన రామాలయం ఉంది. శ్రీరామనవమి నాడు భక్తులతో కిటకిటలాడుతుంది. 1955, 1962లలో భద్రాచలం నుంచి శాసనసభకు ఎన్నికైన మహ్మద్ తహశీల్ భద్రాచలం పట్టణానికి చెందినవారు. పట్టణం గోదావరి నది తీరాన ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
భద్రాచలం మండలం Bhadrachalam Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Kothagudem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి