బూర్గుంపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 64593. ఈ మండలం గోదావరి నది తీరాన ఉంది. సారపాక సమీపంలో ఐటీసి కాగితం పరిశ్రమ ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన అశ్వాపురం మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన పాల్వంచ మండలం, తూర్పున భద్రాచలం మండలం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండల తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుమార్గం ఉంది. పాండురంగాపురంలో రైల్వేస్టేషన్ ఉంది. పాండురంగాపురం నుంచి సారపాకకు రైలుమార్గం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 64593. ఇందులో పురుషులు 32762, మహిళలు 31831. స్త్రీపురుష నిష్పత్తి 972/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలం పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
బూర్గుంపాడు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Burgampadu, Iravendi, Krishnasagar, Morampalli Banjar, Mothe (Pattimalluru), Nagineniprolu, Nakiripeta, Pinapaka (PM), Sarapaka, Sompalli, Tekula, Uppusaka
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఇరవెండి (Iravendi): ఇరవెండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలంకు చెందిన తాళ్లూరి జయదేవ్ 2019 జూలైలో తానా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెడ్డిపాలెం (Reddypalem): రెడ్డిపాలెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలానికి చెందిన గ్రామం. ఏప్రిల్ 2019లో ఈ గ్రామానికి చెందిన పి.విష్ణువర్థన్ రెడ్డి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎన్నికయ్యారు. సారపాక (Sarapaka):
సారపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలమునకు చెందిన గ్రామము. ఇది మండలంలోనే పెద్ద గ్రామము. ఇక్కడ ఐ.టి.సి.పేపరు మిల్లు ఉన్నది. ఈ గ్రామం భద్రాచలంకు 2 కిమీ దూరంలో ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Burgumpahad Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి