13, అక్టోబర్ 2017, శుక్రవారం

తాండూరు మండలం (Tandur Mandal)

జిల్లా వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్తాండూరు
అసెంబ్లీ నియోజకవర్గంతాండూరు
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
(మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కోసం ఇక్కడ చూడండి)
తాండూరు మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం మండల కేంద్రం మీదుగా వెళ్ళుచున్నది. అక్టోబరు 11, 2016 వరకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో భాగమైంది, అదే సమయంలో మండల కేంద్రం రెవెన్యూ డివిజంగా ఏర్పడింది. మండలంలోని కరణ్‌కోట్‌లో సిసిఐ సిమెంట్ కర్మాగారం, సమీపంలోనే పెన్నా సిమెంట్ కర్మాగారం ఉన్నాయి. మల్కాపూర్ ప్రాంతం నాపరాతి గనులకు ప్రసిద్ధి చెందింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న కొత్లాపూర్‌లో ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ దేవాలయం, మండల కేంద్రంలో భావిగి భద్రేశ్వర దేవాలయం ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
తాండూరు మండలం వికారాబాదు జిల్లాలో పశ్చిమం వైపున కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున పెద్దెముల్ మండలం, దక్షిణాన యాలాల్ మండలం, నైరుతిన బషీరాబాదు మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.
 
చరిత్ర:
ఈ ప్రాంతం వెయ్యేళ్ళకుపైగా చరిత్రను కల్గియుంది. పాతతాండూరులో 1000 సం.ల క్రితం నిర్మించిన ఆలయం ఉంది. ఆలయం సమీపంలో ప్రాచీన కోట కూడా ఉండేది కాని ప్రస్తుతం ఆక్రమణల వల్ల పూర్తిగా శిథిలమై కనుమరుగైంది. సెప్టెంబరు 17, 1948న విమోచనోద్యమం వల్ల భారత యూనియన్‌లో చేరి హైదరాబాదు రాష్ట్రంగా భాగంగా, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండి, జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. 1978 వరకు హైదరాబాదు జిల్లాలో ఉండగా ఆగస్టు 15, 1978న కొత్తగా ఏర్పాటుచేసిన రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంటూ తెలంగాణ అవతరణ అనంతరం జిల్లాల పునర్విభజన తర్వాత వికారాబాదు జిల్లాలో భాగమైంది. అదే సమయంలో మండలకేంద్రం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది.


జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 118244. ఇందులో పురుషులు 58897, మహిళలు 59347. అక్షరాస్యుల సంఖ్య 70726. పట్టణ జనాభా 64621, గ్రామీణ జనాభా 53623.

రాజకీయాలు:
ఈ మండలం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన అనిత ఎన్నికయ్యారు.

మండలంలోని గ్రామాలు:
అల్లాపూర్ ఎస్ (Allapur S), అంతారం బుర్జ్ (Antaram Buzurg), బెల్కటూర్ (Belkatur), బిజ్వార్ (Bijwar), బొంకూర్ (Bonkoor), చంద్రవంచ (Chandravancha), చెనిగేష్‌పూర్ (Chengeshpur), చెంగోల్ (Chengole), చింతామణిపట్నం (Chintamanipatam), చిట్టిఘనాపూర్ (Chittighanapur), ఈర్షెట్టిపల్లి (Eershetpally), ఎల్మకన్నె (Elmakanna), జిన్‌గుర్తి (Gingurthy), గోనూర్ (Gonur), గోపన్‌పల్లి (Gopanpally), గౌతాపూర్ (Goutapur), గుంతబాస్పల్లి (Guntabachpally), ఐనోల్ (Inole), జోదండాపుర్ (Jodandapur )





ఫోటో గ్యాలరీ

a


హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు, వికారాబాదు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, తాండూరు మండలము, 


 = = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of statistics, Rangareddy Dist, 2007-08
  • Census Statistics, Rangareddy Dist, 2011
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు (G.O.Ms.No.) 248 తేది 11-10-2016
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు,

Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,Tandur Mandal in Telugu, Tandur town information in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక