5, జులై 2013, శుక్రవారం

యాలాల మండలం (Yalal Mandal)

జిల్లా వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్తాండూరు
అసెంబ్లీ నియోజకవర్గంతాండూరు
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
జనాభా 39451 (2001), 45180 (2011),
యాలాల వికారాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము తాండూరు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండల వ్యవస్థకు పూర్వం ఇది తాండూరు తాలుకాలో భాగంగా ఉండేది. కాగ్నానది మండలం గుండా ప్రవహిస్తోంది. కాకరవేణి, కాగ్నాలు మండలంలోనే సంగమిస్తున్నాయి. 2001 లెక్కల ప్రకారం 39451 జనాభాతో రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప జనాభా కల రెండవ మండలంగా ఉంది. 2011 లెక్కల ప్రకారం స్త్రీపురుష నిష్పత్తిలో (1053/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. మండల విస్తీర్ణం 22453 హెక్టార్లు. జుంటుపల్లి ప్రాజెక్టు, చారిత్రకమైన జుంటుపల్లి రామాలయం మండలంలో ఉన్నాయి. కందులు మండలంలో పండించే ముఖ్యమైన పంట. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో చేర్చబడింది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన తాండూరు మండలం మరియు పెద్దెముల్ మండలం, తూర్పున ధరూరు మండలం, దక్షిణాన బొంరాస్‌పేట మండలం, నైరుతిన కోడంగల్ మండలం, పశ్చిమాన బషీరాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా భీమానది ఉపనది అయిన కాగ్నా మరియు కాకరవేణి నదులు ప్రవహిస్తున్నాయి.
 
చరిత్ర:
యాలాల ప్రాచీన చరిత్రను కల్గియుంది. మండలంలో ప్రాచీన కాలంనాటి పలు ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం గుల్బర్గా జిల్లాలో భాగంగా ఉంటూ సెప్టెంబరు 17, 1948న విమోచనోద్యమం వల్ల భారత యూనియన్‌లో చేరి హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండి, జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు మండలం మొత్తం సకలజనుల సమ్మె జయప్రదమైంది. 1978 వరకు హైదరాబాదు జిల్లాలో ఉండగా ఆగస్టు 15, 1978న కొత్తగా ఏర్పాటుచేసిన రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంటూ తెలంగాణ అవతరణ అనంతరం జిల్లాల పునర్విభజన తర్వాత వికారాబాదు జిల్లాలో భాగమైంది. అదే సమయంలో మండలకేంద్రం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది.


జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 39451. ఇందులో పురుషులు 19537, మహిళలు 19914. 1991 జనాభాతో పోలిస్తే దశాబ్ద కాలంలో 16.45% వృద్ధి సాధించింది. 2001 లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో జనాభాలో ఇది 36వ స్థానంలో ఉంది. జిల్లాలో అత్యల్ప జనాభా కల రెండవ మండలం ఇది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45180. ఇందులో పురుషులు 22007, మహిళలు 23173. అక్షరాస్యుల సంఖ్య 22116. స్త్రీపురుష నిష్పత్తిలో (1053/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలేశ్వర్ గుప్తా ఎన్నికయ్యారు.

అక్టోబరు 11, 2016కు ముందు
రంగారెడ్డి జిల్లాలో యాలాల మండల స్థానం


హోం,
విభాగాలు:
వికారాబాదు జిల్లా మండలాలు, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, వికారాబాదు రెవెన్యూ డివిజన్, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక