రెబ్బెన కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 15' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 23' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కాగజ్‌నగర్ మండలం, పశ్చిమాన తిర్యాని మండలం, వాయువ్యాన ఆసిఫాబాదు మండలం, దక్షిణాన మరియు తూర్పున మంచిర్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం రెబ్బెన మండల జనాభా 33243. ఇందులో పురుషులు 16982, మహిళలు 16261. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35939. ఇందులో పురుషులు 18311, మహిళలు 17628. రవాణా సౌకర్యాలు: మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. ఆసిఫాబాదు రోడ్ పేరుతో మండలంలో రైల్వేస్టేషన్ ఉంది. బొగ్గుకార్మికులు అధికంగా రాకపోకలు సాగిస్తుంటారు. మండలంలో 2 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము
రెబ్బెన మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Dharmaram, Edvalli, Gangapur, Gollet, Jakkalpalle, Khairgaon, Kistapur, Komarvalli, Kondapalle, Nambal, Narayanpur, Navegaon, Nerpalle, Passigaon, Pothpalle, Pulikunta, Rajaram, Rampur, Rangapur, Rebbana, Rollapahad, Rollapet, Seethanagar, Sonapur, Takkallapalle , Tungeda, Venkulam
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గోలేటి (Goleti): గోలేటి కొమురంభీం జిల్లా రెబ్బెన మండలమునకు చెందిన గ్రామము. ఇది క్రీడలకు ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామానికి చెందిన యువకులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నారు. బాల్‌బ్యాడ్మింటన్, సెపక్‌తక్రా, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీలు గ్రామంలో జరుగుతుంటాయి. 1995లో గ్రామంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. 2001లో రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ సెపక్ తక్రా పోటీలు జరిగాయి. 2009లో రాష్ట్రస్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించబడ్డాయి. గంగాపూర్ (Gangapur): గంగాపూర్ కొమురంభీం జిల్లా రెబ్బెన మండలమునకు చెందిన గ్రామము. ఇది మండల కేంద్రానికి సమీపంలో ఉంది. గ్రామంలో శ్రీ బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. కొండపల్లి (Kondapally): కొండపల్లి కొమురంభీం జిల్లా రెబ్బెన మండలమునకు చెందిన గ్రామము. సిమెంటు విగ్రహాలను తయారుచేసే కళాకారుడు జనార్థన్ చారి ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Rebbena Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి