బెజ్జూరు కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఇది జిల్లాలో తూర్పువైపున ప్రాణహిత నది తీరాన ఉన్నది. పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అరణ్యంగా ఉండేది. నిజాం నవాబులు పులులవేటకై ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి పురుషోత్తమరావు, పాల్వాయి రాజ్యలక్ష్మి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలము 19° 20' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 51' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలానికి ఉత్తరాన చింతలమానేపల్లి మండలం, దక్షిణాన మరియు వాయువ్యాన పెంచికలపేట్ మండలం, పశ్చిమాన కాగజ్‌నగర్ మండలం, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42796. ఇందులో పురుషులు 21356, మహిళలు 21440. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49535. ఇందులో పురుషులు 24808, మహిళలు 24727. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసౌకర్యంకాని, జాతీయ రహదారి సౌకర్యంకాని లేదు. పశ్చిమాన సరిహద్దుగా ఉన్న కాగజ్‌నగర్, సిర్పూర్ మండలాల మీదుగా రైల్వేలైన్ వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఈ మండలమునకు చెందిన పాల్వాయి పురుషోత్తమరావు, పాల్వాయి రాజ్యలక్ష్మి సిర్పూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
బెజ్జూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Rechini, Bejjur, Chinnasiddapur, Peddasiddapur, Ambhaghat, Kukuda, Kushnepalle, Gabbai, Bhatpally (D), Marthadi, Nagepalle, Mogavelly, Munjampalle, Outsarangipalle, Papanpet, Sushmeer, Katepalle, Pothepalle, Rebbena, Somini, Tikkapalle, Talai
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బెజ్జూరు (Bejjur): బెజ్జూరు కొమురంభీం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4990. మండలంలో అత్యధిక జనాభా కల గ్రామం ఇదే. గూడెం (Gudem): గూడెం కొమురంభీం ఆసిఫాబాదు జిల్లా చింతలమానెపల్లి మండలమునకు చెందిన గ్రామము. గ్రామం వద్ద ప్రాణహిత నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మిస్తున్నారు. రెబ్బెన (Rebbena): రెబ్బెన కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలమునకు చెందిన గ్రామము. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి స్వగ్రామం ఇది. తలాయి (Talayi): తలాయి కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలమునకు చెందిన గ్రామము. తలాయి గ్రామంలో ప్రాణహిత నదిపై నిజాం ప్రభిత్వం తలపెట్టిన జలవిద్యుత్ కేంద్రం ఇంకనూ ప్రతిపాదన దశలోనేఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bejjur Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి