కెరామెరి కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము.ఈ మండలము 19° 26' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 07' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో జోడేఘాట్ అటవీ ప్రాంతం ఉంది. నిజాంపై పోరాడిన గిరిజన పోరాటయోధుడు కొమురంభీం ఈ ప్రాంతానికి చెందినవారు. ఈ మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 46 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో బోదర జలపాతం ఉంది. 12 గ్రామాలపై మహారాష్ట్రతో వివాదం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున వాంకిడి మండలం, దక్షిణాన ఆసిఫాబాదు మండలం, పశ్చిమాన జైనూర్ మండలం, నైరుతిన సిర్పూర్ యు మండలం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 24530. ఇందులో పురుషులు 12515, మహిళలు 12015. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 30496. ఇందులో పురుషులు 15453, మహిళలు 15043. రవాణా సౌకర్యాలు: . రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2001-06 కాలంలో గోవిందనాయక్ ఎంపీపీగా పనిచేశారు. 2014లో ఎంపీపీగా మాచర్ల గణేశ్, జడ్పీటీసిగా సయ్యద్ అబ్దుల్ కలాం ఎన్నికయ్యారు.
కెరామెరి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Agarwada, Annarpalli, Anthapur, Arekepalli, Arepelli, Babejhari, Bheemangondhi, Bolapater, Chalbadi, Chinthakara, Devapur, Devuepalli, Dhanora, Gowri, Goyagaon, hatti, Indhapur, Isapur, Jankapur, Jhari, Jodeghat, Kallegaon, Keli B, Keli-K, Kerameri, Khairi, Kota, Kotari, Kranjiwada, Lakmapur, Mettapipri, Modi, Murkilonka, Nagapur, Nagapur, Nishani, Paradndoli, Parda, parswada, Patnapur, Pipri, Sakada, Sangvi, Sawarkheda, Surdhapur, Token Movad
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఇందాపూర్ (Imdapur): ఇందాపూర్ కొమురంభీం జిల్లా కెరామెరి మండలమునకు చెందిన గ్రామము. ఇందాపూర్ గ్రామసమీపంలో పెద్దవాగుపై బోదర జలపాతం ఉంది. కెరామెరి నుంచి 16 కిమీ దూరంలో ఉంది. జోడేఘాట్ (Jodeghat): జోడేఘాట్ కొమురంభీం జిల్లా కెరామెరి మండలమునకు చెందిన గ్రామము. జల, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల కోసం పోరాడిన కొమరంభీం అమరుడైన ప్రాంతం ఇదే. ఇక్కడ కొమరంభీం సమాధి, విగ్రహం ఉంది. ఏటా ఐటీడీఏ ఆధ్వర్యంలో వర్థంతిని నిర్వహిస్తారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kerameri Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి