6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం (Balkonda Assembly Constituency)

బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • బాల్కొండ , 
  • మోర్తాడ్, 
  • వేల్పూర్, 
  • కమ్మర్‌పల్లి, 
  • భీంగల్,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎ.అనిల్ ప్రజారాజ్యం పార్టీ ఎస్.శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 వేముల ప్రశాంత్ రెడ్డి తెరాస కె.సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 వేముల ప్రశాంత్ రెడ్డి తెరాస ముత్యాల సునీల్ కుమార్ బీఎస్పీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచిప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఎ.అనిల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి కుమారుడైన శ్రీనివాస్ రెడ్డిపై 8118 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మహాకూటమి తరఫున పోటీచేసిన తెరాస అభ్యర్థి వేముల సురేందర్ మూడో స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ మాజీ స్పీకర్ అయిన కె.సురేష్ రెడ్డిపై 35898 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున వేముల ప్రశాంత్ రెడ్డి, భాజపా తరఫున పి.రమాదేవి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిల్ కుమార్ పోటీచేశారు. తెరాసకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఎస్పీకి చెందిన ముత్యాల సునీల్ కుమార్ పై 32408 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

హోం,
విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక