ఆసిఫాబాదు కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. మండలము 19° 19' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 16' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలం గుండా గుండిపెద్దవాగు ప్రవహిస్తోంది. దీనిపై కొమురంభీం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 24 రెవెన్యూ గ్రామాలు కలవు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధుడు కుమురంభీం స్వగ్రామ ఈ మండలంలోనిదే. 2011 నవంబరు 19న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిచే ఆసిఫాబాదు మండలంలో కొమరం భీం ప్రాజెక్టు ప్రారంభించబడింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన వాంకిడి, కెరామెరి మండలాలు, తూర్పున కాగజ్‌నగర్ మండలం, ఆగ్నేయాన రెబ్బెన మండలం, దక్షిణాన తిర్యాని మండలం, పశ్చిమాన సిర్పూర్-యు, తిర్యాని మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49782. ఇందులో పురుషులు 25332, మహిళలు 24450. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58615. ఇందులో పురుషులు 29429, మహిళలు 29186. పట్టణ జనాభా 23153 కాగా గ్రామీణ జనాభా 35462. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-ఢిల్లీ రైలుమార్గం ఆసిఫాబాదు నుంచి వెళ్ళుతుంది. జాతీయ రహదారి లేకున్ననూ రోడ్డు మార్గాన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము
ఆసిఫాబాదు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ada, Ada - Dasnapur, Addaghat, Ankusapur, Appepalle, Asifabad (CT), Babapur, Balahanpur, Balegaon, Buruguda, Cherpalle, Chilatiguda, Chirrakunta, Dadpapur, Dagleshwar, Danaboinapeta, Danapur, Demmidiguda, Devadurgam, Edulwada, Govindapur, Gundi, Ippalnavegaon, Itukyal, Khapri, Kommuguda, Kommuguda, Kosara, Kowdianmovad, Kutoda, Malan Gondi, Mankapur, Mondepalle, Mothuguda, Mowad, Nandupa, Padibonda, Perasnambal, Rahapalle, Rajura, Routsankepalle, Saleguda, Samela, Singaraopet, Siryan Mowad, Suddha Ghat, Temrianmovad, Tumpalle, Wadigondi, Wadiguda, Wavudham,, Yellaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆసిఫాబాదు (Asifabad): ఆసిఫాబాదు కొమురంభీం జిల్లాకు చెందిన పట్టణము మరియు జిల్లా కేంద్రము. ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం కూడా. దీని అసలుపేరు జనగామ. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి బస్సు డీపో ఇక్కడే నెలకొల్పబడింది. స్వాతంత్ర్య సమరయోధులు ఏకబిళ్వం రేవయ్య, ఏకబిళ్వం నాగేంద్రయ్య, బోనగిరి వేంకటేశం, శీలా విఠల్, శీలా శంకర్ ఇక్కడివారే. సమీపంలో పెద్దవాగు ప్రవహిస్తోంది. దీనిపైన వట్టివాగు ప్రాజెక్టు ఉంది. ఈ పట్టణానికి చెందిన అరిగెల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అటవీశాఖ చైర్మెన్‌గా, ఎంపీపీగా పనిచేశారు. సంకెనపల్లి (Sankenapalli): సంకెనపల్లి కొమురంభీం జిల్లా ఆసిఫాబాదు మండలమునకు చెందిన గ్రామము. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధుడు కుమురంభీం స్వగ్రామం. బాల్యంలో ఉన్నప్పుడే భీం తండ్రి మరణించడంతో కరిమెరికి వచ్చి స్థిరపడ్డాడు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Asifabad Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి