నార్నూర్ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 32' 00'' ఉత్తర అక్షాంశం మరియు 78° 53' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో పారకప్పీ మరియు గుండాల జలపాతాలున్నాయి. మాన్కాపూర్, గుండాల, పూసిగూడ లలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 24 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న మండలంలోని 30 గ్రామాలను విడదీసి కొత్తగా గడిగూడ మండలాన్ని ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన గడిగూడ మండలం, పశ్చిమాన ఉట్నూరు మండలం మరియు ఇంద్రవెల్లి మండలం, తూర్పున మరియు దక్షిణన ఆసిఫాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన జాదవ్ రమేశ్, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుమన్ బాయి రాథోడ్ ఈ మండలమునకు చెందినవారు.
నార్నూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Babjhari, Balanpur, Bheempur, Chorgaon, Dhupapur, Empalli, Gangapur, Gundala, Gunjala, Khairdatwa, Khampur, Kothapalli - H, Mahadapur, Mahagaon, Malangi, Malepur, Manjari, Mankapur, Nagolkonda, Narnoor, Sonapur, Sungapur, Tadihadapnur, Umri
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గుండాల (Gundala): గుండాల ఆదిలాబాదు జిల్లా నార్నూర్ మండలమునకు చెందిన గ్రామము. 1000 ఎకరాల సాగునీటి లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మించబడింది. 2012 నవంబరు 21 నాడు గ్రామంలో గోండు భాషలో చెందిన పురాతన రచనలు లభ్యమయ్యాయి. మాన్కాపూర్ (Mankapur): మాన్కాపూర్ ఆదిలాబాదు జిల్లా నార్నూర్ మండలమునకు చెందిన గ్రామము. 2008-09లో జేబీఐసీ నిధులతో 1500 ఎకరాలకు సాగునీరు అందించడానికి మాన్కాపూర్‌లో సాగునీటి ప్రాజెక్టు నిర్మించబడింది. పూసిగూడ (Pusiguda): పూసిగూడ ఆదిలాబాదు జిల్లా నార్నూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించబడింది. తాడిహత్నూర్ (Tadihatnur): తాడిహత్నూర్ ఆదిలాబాదు జిల్లా నార్నూర్ మండలమునకు చెందిన గ్రామము. ఖానాపుర్ ఎమ్మెల్యేగా పనిచేసిన సుమన్ బాయి రాథోడ్ స్వగ్రామం. జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన జాదవ్ రమేశ్ ఈ గ్రామానికే చెందినవారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Narnoor Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి