11, నవంబర్ 2013, సోమవారం

నామా నాగేశ్వరరావు (Nama Nageshwara Rao)

జననంమార్చి 15, 1957
స్వస్థలంబలపాల (కురవి మండలం)
రంగంవ్యాపారం, రాజకీయాలు
పదవులు2 సార్లు ఎంపీ
మహబూబాబాదు జిల్లా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడైన నామా నాగేశ్వరరావు 1957 మార్చి 15న కురవి మండలం బలపాల గ్రామంలో జన్మించారు. బలపాల గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత ఖమ్మంలో సెకండరీ విద్య పూర్తి చేసి, పాల్వంచలో ఎన్‌ఎంఆర్‌గా పని చేశారు. తొలుత వ్యాపారం రంగంలో రాణించి, అనంతరం రాజకీయ ప్రవేశం చేశారు. 2019లో 17 వ లోకసభకు ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం:
నామా నాగేశ్వరరావు 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున లోకసభకు పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రేణుకా చౌదరి చేతిలో ఓడిపొయారు. 2009లో రేణుకా చౌదరిపైనే సుమారు 125000 ఓట్లతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోగా పనిచేశారు.15వ లోకసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ఎన్నికయ్యారు. 2014లో వైకాపాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయి, 2019లో రేణుకా చౌదరిపై ఖమ్మం నుంచి విజయం సాధించారు

వ్యాపారవేత్తగా:
నాగేశ్వరరావు రాజకీయాలలో ప్రవేశించక ముందే ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గడించారు. మధుకాన్ కంపెనీకి ఛైర్మైన్ గా ఉన్నారు. ఈ సంస్థ గ్రానైట్,కాంట్రాక్ట్ లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియు ఇతరత్రా వ్యాపారాలని నిర్వహిస్తున్నది.

సామాజిక సేవలు:
1996లో నామా ముత్తయ్య మొమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. విద్య, వైద్య సౌకర్యాలతో పాటు తాగు నీటి సౌకర్యం కల్పించారు.

కుటుంబం:
నామా నాగేశ్వరరావు తల్లి వరలక్ష్మి ఉత్తమ మాతృమూర్తిగా అవార్డు పొందారు.

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు: మహబూబాబాదు జిల్లా ప్రముఖులు, 15వ లోకసభ సభ్యులు, 17వ లోక్‌సభ సభ్యులు,


 = = = = =


Tags: Biography of Tumati Donappa, Rigistrar of Andhra university and Telugu Univiersity

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక