కురవి మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 19 ఎంపీటీసి స్థానాలు, 48 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయ నాయకులు నామా నాగేశ్వరరావు, సత్యవతి రాథోడ్ ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మహబూబాబాదు మండలం, తూర్పున గార్ల మండలం, ఆగ్నేయాన డోర్నకల్ మండలం, ఈశాన్యాన బయ్యారం మండలం, పశ్చిమాన చిన్నగూడూరు మండలం మరియు మరిపెడ మండలం, దక్షిణాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 64331. ఇందులో పురుషులు 31319, మహిళలు 32012. గృహాల సంఖ్య 14335. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 67400. ఇందులో పురుషులు 33134, మహిళలు 34266. స్త్రీపురుష నిష్పత్తి 1034/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఖమ్మం నుంచి 2 సార్లు (2009 & 2019) లోక్‌సభకు ఎన్నికైన నామా నాగేశ్వరరావు, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యవతి రాథోడ్ ఈ మండలానికి చెందినవారు. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన గుగులోతు పద్మావతి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన బండి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.
కురవి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ayyagaripalli, Balapala, Chinthapalli, Gundrathimadugu, Kampalli, Kancherlagudem, Kandikonda, Kuravi, Madugulagudem, Mogilicherla, Nallela, Narayanapur, Nerada, Rajole, Seerole, Sudanpalli, Tallasankeesa, Thattupalli, Thirumalapur, Upparagudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బలపాల (Balapala): బలపాల మహబూబాబాదు జిల్లా కురవి మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు ఈ గ్రామానికి చెందినవారు. ఈయన ఖమ్మం నుంచి 2 సార్లు లోక్‌సభకు ఎన్నికైనారు. గుండ్రాతిమడుగు (Gundratimadugu): గుండ్రాతిమడుగు మహబూబాబాదు జిల్లా కురవి మండలమునకు చెందిన గ్రామము. 2019లో తెలంగాణ రాష్ట్రమంత్రివర్గంలో స్థానం పొందిన సత్యవతి రాథోడ్ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kuravi Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి