19, మే 2014, సోమవారం

తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rasthra Samithi)

 తెలంగాణ రాష్ట్ర సమితి
స్థాపనఏప్రిల్ 27, 2001
స్థాపకుడుకె.చంద్రశేఖరరావు
ప్రస్తుత లోకసభ స్థానాలు11
ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు63
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీని 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారు. జయశంకర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన తెరాస ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చూపించి సంచలనం సృష్టించింది. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని 26 అసెంబ్లీ, 5 లోకసభ స్థానాలలో విజయం సాధించింది. 2009లో తెలుగుదేశం పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఏర్పడిన మహాకూటమిలో భాగంగా పోటీచేసి 10 శాసనసభ, 2 లోకసభ స్థానాలను కైవసం చేసుకుంది. ఉద్యమపార్టీగా పేరుపొందిన తెరాస చాలా సార్లు ఉప ఎన్నికలలో సత్తా చూపింది. 2011-13 తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి ప్రజలలో చైతన్యం కలిగించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన అనంతరం జరిగిన 2014 ఎన్నికలలో తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు గాను 11 స్థానాలు, 119 అసెంబ్లీ సీట్లలో 63 సాధించి తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తెరాస స్థాపకుడు
కె.చంద్రశేఖర్ రావు
తెరాస ప్రముఖులు:
తెరాస స్థాపన నుంచి పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో ఆలె నరేంద్ర తెరాసలో ప్రధాన పాత్ర పోషించి, చంద్రశేఖర్ రావుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిననూ ఆ తర్వాత తెరాస నుంచి ఉధ్వాసనకు గురయ్యారు. తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి కూడా తెరాసలో ఉండి 2009 లోకసభ ఎన్నికలలో మెదక్ నుంచి విజయం సాధించి పార్టీలో ప్రధాన స్థానంలో ఉండిననూ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పలువురు ప్రముఖులు, 12వ శాసనసభలో మంత్రులుగా వ్యవహరించిన వారు కూడా తర్వాతి కాలంలో పార్టీని వదిలివెళ్ళారు. సిద్ధిపేట నుంచి భారీ మెజారిటీతో వరస విజయాలు సాధిస్తున్న కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు ప్రారంభం నుంచి పార్టీ అభివృద్ధికి ముఖ్యంగా సిద్ధిపేట ప్రాంతంలో తెరాస విజయాలకు కృషిచేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన కె.కేశవరావు తెరాసలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్ కూడా జూలై 2015లో తెరాసలో చేరారు.
తెరాస జనరల్ నాలెడ్జి

ఇవి కూడా చూడండి:


విభాగాలు: భారతదేశ రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయాలు, 2001 స్థాపితాలు, తెలంగాణ రాష్ట్ర సమితి,


 = = = = =


1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక