ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు ఎల్లారెడ్డి తాలుకాలోని గ్రామాలు. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 31 రెవెన్యూ గ్రామాలు కలవు. మెదక్ నుంచి బోధన్ వెళ్ళు ప్రధాన రహదారి ఎల్లారెడ్డి మీదుగా వెళ్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలోకి మారింది.
భౌగోళికం, సరిహద్దులు: ఎల్లారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణం వైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గాంధారి మండలం, తూర్పున లింగంపేట మండలం, దక్షిణాన నాగిరెడ్డిపేట మండలం, పశ్చిమాన నిజాంసాగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46254. ఇందులో పురుషులు 22563, మహిళలు 23691. రాజకీయాలు: ఈ మండలము ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. 2019లో ఎల్లారెడ్డి ZPTCగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఉషాగౌడ్ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Advilingal, Annasagar, Bhiknoor, Brahmanpalle, Daval Malkapalle, Devanpalle, Gandimasanipet, Hajipur, Hemagiri, Jangamaipalle, Jankampalle (Khurd), Kottal, Laxmapur, Lingareddipet, Machapur, Mallaipalle, Mathadpalle, Mathmal, Misanpalle, Moulanakhed, Repallewada, Rudraram, Safdarpur, Sivapur, Somawarpet, Timmapur, Timmareddy, Vellutla, Venkatapur, Venkatapur (Agraharam), Yellareddy (CT)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మీసాన్‌పల్లి (Misanpally):మీసాన్‌పల్లి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. భూముల విషయంలో నూతన విధానాన్ని అమలుపర్చేందుకు ప్రవేశపెట్టిన "భూభారతి" పథకాన్ని తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ గ్రామంలో ప్రారంభించారు. ఎల్లారెడ్డి (Yelareddy): ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది రెవెన్యూ డివిజన్ మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం. మండల వ్యవస్థకు పూర్వం ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. ఇది చారిత్రాత్మకమైన గ్రామము. ఇచ్చట ప్రాచీన మానవుని అవశేషాలు లభించాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Yellareddy Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి