1, జులై 2014, మంగళవారం

బి.సి.రాయ్ (Bidhan Chandra Roy)

బి.సి.రాయ్
జననంజూలై 1, 1882
రంగంవైద్యుడు, సమరయోధుడు, రాజకీయనేత,
పదవులుపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,
అవార్డులుభారతరత్న (1961)
మరణంజూలై 1, 1962
ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న గ్రహీత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిదన్ చంద్ర రాయ్ 1882 జూలై 1న ప్రస్తుత బీహార్‌లోని బంకిపూర్‌లో జన్మించారు. ఈయన పూర్తి పేరు బిధన్ చంద్ర రాయ్. వైద్యవృత్తి నిర్వహిస్తూనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి, శాసససభ్యుడిగా, కోల్‌కత నగర మేయరుగా ఎన్నికై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవి కూడా అందుకున్నారు. కోల్‌కత విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గానూ వ్యవరించారు. పలు ఉన్నత పదవులు అలంకరించిన బి.సి.రాయ్ 1962 జూలై 1న జన్మదినం రోజే మరణించారు.

జీవనం:
ఇంగ్లండులో M.R.C.P. మరియు F.R.C.S. డిగ్రీలను పూర్తిచేసి 1911 సంవత్సరంలో స్వదేశానికి తిరిగివచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు. పలు వైద్య సంస్థలను నెలకొల్పారు. 1926 లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేసారు. 1922-1928 మధ్యకాలంలో కలకత్తా మెడికల్ జర్నల్ కు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారు. 1942 లో కోల్ కతా విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా, 1943 లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. విద్యా, వైద్య రంగాలలో ఈయన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబడింది.

రాజకీయ ప్రస్థానం:
1925 లో రాజకీయ రంగ ప్రవేశం చేసి బరక్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్ గా పేరొందిన సురేంద్రనాధ్ బెనర్జీని ఓడించారు. 1928 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు అయ్యారు. 1933 లో కోల్ కతా నగరానికి మేయర్ గా ఎన్నికైనారు. 1948 జనవరి 13 న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

గుర్తింపులు:
1961లో ఈయనను భారత రత్న వరించింది. ఈయన స్మారకార్ధం ప్రతిఏటా జూలై ఒకటిన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962 లో ప్రకటించింది. వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు.

విభాగాలు: కోల్‌కత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, 1882లో జన్మించినవారు, 1962లో మరణించినవారు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక